ఆదిలాబాద్ కలెక్టర్ పై ప్రశంసల వర్షం..కారణం ఆమె నేర్చుకున్న ఆ భాష.! అసలేమైందో తెలుసా.?

మ‌న దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్ర‌జ‌లు అనేక భాష‌ల‌ను మాట్లాడుతార‌ని మ‌నంద‌రికీ తెలిసిందే. ఒక్కో ప్రాంతం వారు ఒక్కో ర‌క‌మైన భాష‌ను, యాస‌ను మాట్లాడుతారు. అయితే తెలంగాణ రాష్ట్రం విష‌యానికి వ‌స్తే అందులో ప్ర‌త్యేకంగా ఆదిలాబాద్ తోపాటు దాని చుట్టూ ఉన్న ప‌లు ప్రాంతాల్లో అధిక శాతం మంది ప్ర‌జ‌లు మాట్లాడేది గోండి భాష‌. ఇది చాలా మందికి తెలియ‌దు, అర్థం కాదు. దీంతో ప్ర‌భుత్వం అందించే ప‌థ‌కాల‌కు స‌ద‌రు గోండు ప్ర‌జ‌లు దూరంగా ఉంటున్నారు. ఎంతో మంది అధికారులు ఈ ప్రాంతంలో ప‌నిచేశారు, కానీ గోండు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స‌రిగ్గా అర్థం చేసుకుని వాటిని ప‌రిష్క‌రించ‌లేక‌పోయారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం భాష స‌మ‌స్యే. అయితే ఇదే స‌మ‌స్య‌ను తెలుసుకున్న ప్ర‌స్తుత ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ దివ్య దేవ‌రాజ‌న్ వినూత్న రీతిలో గోండు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు య‌త్నిస్తూ అంద‌రి ప్ర‌శంస‌ల‌ను పొందుతున్నారు.

సాధార‌ణంగా మ‌నం పిల్ల‌ల‌కు ద‌గ్గ‌ర‌వ్వాలంటే వారి మ‌న‌స్త‌త్వం తెలుసుకోవ‌డంతోపాటు వారిలాగే వారి ఎదుట ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది. దీన్ని తెలిసిన వారు కాబ‌ట్టే ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ దివ్య దేవ‌రాజ‌న్ అక్క‌డి గోండు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు అడ్డంకిగా ఉన్న ప్ర‌ధాన‌మైన భాష స‌మ‌స్య‌ను అధిగ‌మిస్తున్నారు. ఆ భాష‌ను ఆమె నేర్చుకుంటున్నారు. అందుకు ఓ అనువాద‌కుడిని కూడా ఆమె నియ‌మించుకున్నారు. ఇక ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు చెందిన కార్య‌క్ర‌మాల‌ను పెట్టిన‌ప్పుడు గోండుల‌ను స‌మావేశాల‌కు పిల‌వ‌డం, వారు గోండి భాష‌లో చెప్పే స‌మ‌స్య‌ల‌ను అనువాద‌కుడి ద్వారా అనువాదం చేయించుకుని విని, మ‌ళ్లీ ప్ర‌భుత్వ ప‌థ‌కాల గురించి తిరిగి అదే అనువాద‌కుడితో గోండి భాష‌లో ఆ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పిస్తూ ఆమె వినూత్న ప్ర‌యోగం చేస్తున్నారు.

అలా దివ్య దేవ‌రాజ‌న్ గోండి భాషలో అక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డ‌మే కాదు, ఆ భాష‌ను కూడా ఆమె నేర్చుకుంటున్నారు. చిన్న చిన్న‌ప‌దాలు, వాక్యాల‌ను గోండి భాష‌లో మాట్లాడుతూ అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నారు. దీంతో త‌మ స‌మ‌స్య‌ల‌ను వినే ప్ర‌భుత్వ అధికారిణి వచ్చింద‌ని భావిస్తున్న గోండు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున విన‌తిప‌త్రాల‌ను స‌మ‌ర్పిస్తున్నారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌ని చెబుతున్నారు. వారికి ఆ క‌లెక్ట‌ర్ దివ్య దేవ‌రాజ‌న్ ఇప్పుడు దేవ‌తలా క‌నిపిస్తోంది. ఆమె త‌మ భాష‌ను మాట్లాడుతుండ‌డం చూసి వారు మురిసిపోతున్నారు. ఎట్టకేల‌కు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకునే ఆఫీస‌ర్ వ‌చ్చార‌ని వారు ఇప్పుడు ఆమెకు అక్క‌డ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో గ‌తంలో క‌న్నా ఇప్పుడు చాలా మంది ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వినియోగించుకునేవారు పెరిగారు. ఇదంతా క‌లెక్ట‌ర్ దివ్య దేవ‌రాజ‌న్ చ‌ల‌వే అంటే న‌మ్మ‌గ‌ల‌రా. ఇందుకు గాను ఆమెను అంద‌రం అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top