యాక్షన్ ఓవరైంది: కలెక్టర్ ఆమ్రపాలి స్పీచ్ నవ్వులు…వెటకారాలు.! మైక్ లో ఏం రికార్డ్ అయ్యిందో తెలుసా.?

యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్‌ ఆమ్రపాలి ఏం చేసినా  అటు మీడియాకే కాదు ఇటు జనాలకు హాట్  టాపిక్కే..మొన్నటివరకు ఆమె  పెళ్లి ముచ్చట సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తే..ఇప్పుడు ఆమె గణతంత్ర దినోత్సవం రోజు ఇచ్చిన స్పీచ్ న్యూస్ అయింది..న్యూస్ కన్నా న్యూసెన్స్ క్రియేట్ చేసింది అంటే కరెక్ట్ గా ఉంటుందేమో.. అసలు ఒక జిల్లాకి కలెక్టర్ గానే వ్యవహరించలేదు అని కొందరు అభిప్రాయపడితే,ఇంకా కాలేజ్ గర్ల్ అనుకుంటుందా అని మరికొందరు విమర్శించారు..ఇంతకీ ఆమె ఆ స్పీచ్ లో ఏం చేసిందో తెలుసా…

శుక్రవారం గణతంత్ర దినోత్సవం సంధర్బంగా హన్మకొండ పోలీసు పరేడ్ మైదానంలో ఆమ్రపాలి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత  ప్రసంగించారు..తెలుగులో రాసి ఉన్న ప్రసంగాన్ని చదువేటప్పుడు ఆమ్రపాలి తడబడ్డమే కాదు,ప్రసంగాన్ని కంటిన్యూ చేయకుండా నవ్వారు.  వరంగల్ జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తోందని, ఓడీఎఫ్ జిల్లాగా మారుతోందని, పలు అవార్డులు కూడా వచ్చాయని చెప్తూ… జిల్లాలో కేంద్ర, రాష్ట్ర పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని అక్కడివరకు సరిగ్గానే ప్రసంగించిన ఆమ్రపాలి..మరుగుదొడ్ల నిర్మాణం అనే పాయింట్ వచ్చేసరికి మధ్యలో అకారణంగా నవ్వారు.అంతేకాదు అది అక్కడితో ఆపేయకుండా తనను నవ్వుని ఆపుకోలేక వెంటనే  ‘ఇట్స్ ఫన్నీ’ అని అనడంతో మైకులో వినిపించింది. కలెక్టర్ ప్రసంగం ఇలా సాగడంతో అక్కడివచ్చినవారు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇప్పటివరకూ ఆమ్రపాలి ఏం చేసినా న్యూస్ అయినప్పటికీ ఈ విషయం పట్ల కొందరు అసంతృప్తికి ,ఆగ్రహానికి గురవుతున్నారు.మరుగుదొడ్ల విషయంలో అంత నవ్వడానికి ఏం ఉందని,కలెక్టర్ స్థాయిలో ఉన్నామె అలా ప్రవర్తించడం ఏంటని అభిప్రాయపపడుతున్నారు.ఆ వీడియోలో “కైవసం” అనే పదాన్ని ఉచ్చరించిన తెలుగు సరిగ్గా చదవడం రాకపోవడానికి,ఆమె ఏం ఉత్తర భారతదేశానికి చెందిన ఆమె కాదు కదా అని అభిప్రాయపడుతున్నారు..ఆ వీడియో మీరు చూడండి..

జెండా వందనం అనంతరం ఆమె తన ప్రసంగం మధ్యలో అదే పనిగా అకారణంగా, అసందర్భంగా నవ్వడం, గణాంకాల దగ్గర తడబడడం, అంతేకాకుండా ‘ఇట్స్‌ ఫన్నీ’ అంటూ వ్యాఖ్యానించారు. తెలుగులో రాసిన ప్రసంగాన్ని చదువుతూ పలుమార్లు తడబడ్డారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి ప్రస్తావన వచ్చినపుడు ఏకంగా వెనక్కి తిరిగి నవ్వుకుంటూ తనలో తాను ‘ఇట్స్‌ ఫన్నీ’ అంటూ వ్యాఖ్యానించారు. ఈతతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన భారీ మైకుల ద్వారా అందరికీ వినిపించింది. అంతేకాదు ఆమ్రపాలి తడబడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top