“కలెక్టర్ ఆమ్రపాలి” గారు అందరిలా కాదు..చాలా స్పెషల్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం! ఏం చేసారు?

రంగల్ జిల్లాకు కలెక్టర్ ఐన అమ్రపాలి గారు కలెక్టర్ గా కేవలం తన వృత్తి విషయంలో మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో భిన్నంగా, ఉన్నతంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఎప్పుడూ ఫార్మల్ గా ఉంటూ నేను ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ని, కలెక్టర్ ను అని ఒక అధికారిగా నడుచుకుంటే ప్రజలు, యువత తమ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు రాకపోవచ్చు అమ్రపాలి గారి నడవడికతో వరంగల్ లో ఉన్న సమస్యలను తగ్గి ప్రజలు ఆశించిన, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు నెరవేరుతున్నాయి.

తాజాగా రాక్‌క్లైంబింగ్‌ ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె హుషారుగా గుట్టలెక్కేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గల సహజ సిద్ధమైన పాండవుల గుట్టల్లో రాక్‌ క్లైంబింగ్‌ వేడుకలు హుషారుగా సాగాయి. తెలంగాణ ఫారెస్టు ఎకో టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలు ఆదివారం ముగిశాయి. జిల్లా కేంద్రంతో పాటు కాకతీయ వర్సిటీ, నిట్‌ విద్యార్థులు, హైదరాబాద్‌కు చెందిన 150 మంది విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భూపాలపల్లి డీఎఫ్‌వో రవి కిరణ్ కూడా పాల్గొన్నారు. అర్పణ, రవి కిరణ్ భార్యాభర్తలు కావడం గమనార్హం.

పాండవుల గుట్టను తెలంగాణలోనే మంచి టూరిస్ట్ ప్లేస్ లో ఒకటిగా తీర్చిదిద్దాలని అటవి శాఖ వారు ఈ ఫెస్టివల్స్ నిర్వహించారు. అప్పటికే ఇందులో పాల్గొనడానికి 250 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అక్కడి వారందరినీ ఆశ్చర్యపరిచి వారితో పాటు అమ్రపాలి గారు కూడా సరదాగ ఇంత పెద్ద గుట్టను అదిరోహించడం తన శక్తికి నిర్వచనం. ఒకసారి అమ్రపాలి గారు తన తోటి కలెక్టర్ ప్రీతి అమీనా(మహబూబాబాద్) గారితో కలసి బయ్యారం పెద్దగుట్ట అడవిలో 12కిలో మీటర్ల దూరం కాలినడ ద్వారా వెళ్ళారు. 4 గంటల పాటు ఆ పచ్చని అడవిలోనే గడిపి కేవలం పర్యటించడం వరకు మాత్రమే కాకుండా అడవిలో ఉన్న సమస్యల గురించి, అక్కడి ప్రజల జీవన విధానాల గురించి తెలుసుకోవడం ప్రజలపై తనకున్న ప్రేమను తెలియజేస్తుంది.

Comments

comments

Share this post

scroll to top