ఈ వీడియోను చూస్తే ఇక‌పై మీరు ప్రైవేటు బ‌స్సులో అస్స‌లు ప్ర‌యాణం చేయ‌రు..!

ప్రైవేటు బ‌స్సులంటే అంతే..! వాటిని ఎక్కితేనే య‌మ‌పురికి స్వాగ‌తం చెప్పిన‌ట్టు అనిపిస్తుంది. నిబంధ‌న‌ల‌ను పాటించ‌కుండా వారు బ‌స్సుల‌ను న‌డిపిస్తారు. ఆ బ‌స్సుల‌ను న‌డిపే డ్రైవ‌ర్ల‌కు స‌రైన అవ‌గాహ‌న ఉండ‌దు. దీనికి తోడు డ్రైవింగ్ అంత బాగా ఏం ఉండ‌దు. ఈ క్ర‌మంలో వాటిలో ప్ర‌యాణిస్తే ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. గ‌మ్య‌స్థానం చేరే వ‌ర‌కు సుర‌క్షితంగా ఉంటామ‌ని గ్యారంటీ ఉండ‌దు. గ‌తంలో ఎన్నో సంఘ‌ట‌న‌ల్లో ప్రైవేటు బ‌స్సుల‌కు యాక్సిడెంట్లు అవ‌డం మ‌నం చూశాం. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సంఘ‌ట‌న కూడా అటువంటిదే. కాక‌పోతే ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. కానీ… ప్ర‌మాదం జ‌రిగే లెవ‌ల్లో ఆ బ‌స్సుల డ్రైవ‌ర్లు పోటీ ప‌డి మ‌రీ బ‌స్సుల‌ను న‌డిపారు. దీంతో ఆ బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికులు ప‌డిన భ‌యం అంతా ఇంతా కాదు.

అది తమిళనాడులోని కోయంబత్తూరు-పొల్లాచి జాతీయ రహదారి. ఆ ర‌హ‌దారి ఇంకా నిర్మాణ ద‌శ‌లోనే ఉంది. దీంతో తారు రోడ్డు చాలా త‌క్కువ‌గా ఉంది. మొత్తం కంక‌ర‌తోనే నిండి ఉంది. అయితే ఆ రోడ్డుపై ఇద్ద‌రు ప్రైవేటు బ‌స్సు డ్రైవ‌ర్లు పోటీ ప‌డ్డారు. తొలుత ఓ బస్సు మరో బస్సును క్రాస్‌ చేసేందుకు ప్రయత్నించగా ఆ బస్సు డ్రైవర్‌ పక్కకు తొలగలేదు. దీంతో ఏకంగా క్రాస్‌ చేయాలనుకున్న మరో బస్సు డ్రైవర్‌ అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లాడు. ఆ రోడ్డు ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో దుమ్మురేగిపోయింది.

ఇలా ఒకరిని ఒకరిని ఒకరు క్రాస్‌ చేస్తూ బైకు రేసు మాదిరిగా గాల్లో తేలిపోయే వేగంతో దూసుకెళ్లారు. ఈ క్ర‌మంలో ఎదురుగా వచ్చే వాహ‌న‌దారుల‌కే కాదు, పక్కన వెళ్లే వారికి కూడా గుండె ఆగినంత పనైంది. ఇక ఆ బస్సుల్లో ఉన్నవారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. వారు అలా బ‌స్సులు వేగంగా వెళ్లినంత సేపు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకున్నారు. అలా కొంత సేపు ఇద్ద‌రు డ్రైవ‌ర్లు పోటీ ప‌డ్డారు. కాగా వాటి వెనుకాలే వస్తున్న ఓ బైకిస్టు ఈ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా పెద్ద సంచలనం అయింది. ఈ క్రమంలో విష‌యం తెలుసుకున్న సంబంధిత అధికారులు ఆ బస్సు డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేశారు. మరోసారి ఇలా బస్సులను నడిపిస్తే పర్మిట్‌ రద్దు చేస్తామంటూ అధికారులు హెచ్చరించారు. అవును మ‌రి, అలాంటి వారిని అస్స‌లు ఉపేక్షించ‌రాదు, క‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే. ఏది ఏమైనా ఆ బ‌స్సుల‌కు ఏమీ కానందుకు అంద‌రం సంతోషించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top