“పారాషూట్” కొబ్బరి నూనె గురించి ఈ షాకింగ్ నిజం మీకు తెలుసా.? హెయిర్ ఆయిల్ అనుకోని వాడుతున్నాము కానీ.!

పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్ తెలుసు క‌దా. మనం చిన్న‌ప్ప‌టి నుంచి దాన్ని మ‌న జుట్టుకు వాడుతూ వ‌స్తున్నాం. చ‌లికాలంలో అయితే అందులో ఉండే నూనె గ‌డ్డ క‌ట్టుకుపోతుంది. దీంతో దాన్ని వేడి చేసి రాసుకునేవారం గుర్తుందా. అయితే ఇప్ప‌టికీ అనేక మంది ఈ ఆయిల్‌ను జుట్టుకు వాడుతున్నారు లెండి. అది వేరే విష‌యం. మార్కెట్‌లోకి ఎన్ని కొత్త హెయిర్ ఆయిల్స్ వ‌చ్చినా పారాచూట్ ఆయిల్‌ను మాత్రం చాలా మంది ఇప్ప‌టికీ వాడుతూనే ఉన్నారు. అయితే ఈ ఆయిల్ గురించి మీకో విష‌యం తెలుసా..? నిజానికి మ‌నం ఈ ఆయిల్‌ను హెయిర్ ఆయిల్‌లా వాడుతున్నాం కానీ, పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్ హెయిర్ ఆయిల్ కాద‌ట‌. అవును మీరు విన్న‌ది నిజ‌మే. అది కుకింగ్ ఆయిల్ అట‌. అవును, సాక్షాత్తూ దాన్ని త‌యారు చేసే కంపెనీయే ఆ మాట చెబుతోంది.

పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్ హెయిర్ ఆయిల్ కాదు. అది కుకింగ్ ఆయిల్‌. కావాలంటే దాని ప్యాకింగ్‌పై ఎక్క‌డ చూసినా కొకొన‌ట్ ఆయిల్ అని ఉంటుంది కానీ… హెయిర్ ఆయిల్ అని ఉండ‌దు కదా. చూశారు క‌దా. అంతే కాదు, ఆ ఆయిల్ కుకింగ్ ఆయిల్ అని చెప్పి దాన్ని త‌యారు చేసే మ‌రికో అనే కంపెనీ వాదిస్తూ ప్ర‌భుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతోంది. ఎందుకంటే.. కుకింగ్ ఆయిల్స్ పై ఎక్సైజ్ సుంకం ఉండ‌దు. కాస్మొటిక్స్‌లో ఒక భాగ‌మైన హెయిర్ ఆయిల్స్‌పైనే ఈ సుంకం ఉంటుంది. క‌నుక మ‌రికో అనే కంపెనీ ఏం చేస్తుందంటే.. త‌న పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్‌ను కుకింగ్ ఆయిల్ అని చెబుతోంది. అందుకే దాని ప్యాక్‌పై కూడా ఎక్క‌డా హెయిర్ ఆయిల్ అని ముద్రించ‌లేదు. అయితే దీన్ని మాత్రం ఆ కంపెనీ హెయిర్ ఆయిల్‌గానే యాడ్స్‌లో ప్రచారం చేసుకుంటోంది. కాగా దీనిపై ప్ర‌భుత్వం కోర్టుకెక్కింది.

స‌ద‌రు మ‌రికో కంపెనీ త‌యారు చేస్తున్న పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కాద‌ని, హెయిర్ ఆయిలేన‌ని, క‌నుక దానిపై ట్యాక్స్ వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టును ప్ర‌భుత్వం కోరింది. అయితే కోర్టు ఇందుకు వివ‌ర‌ణ అడ‌గ్గా సద‌రు మ‌రికో కంపెనీ త‌న వాద‌న వినిపించింది. తాము త‌యారు చేస్తున్న పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ అని, హెయిర్ ఆయిల్ కాద‌ని, దానిపై ఎక్క‌డా హెయిర్ ఆయిల్ అని వేయ‌లేద‌ని, కావాలంటే అది చూసుకోవ‌చ్చ‌ని మ‌రికో వాదిస్తోంది. అయితే మ‌రి 200 ఎంఎల్ క‌న్నా త‌క్కువ మొత్తంలో ప్యాక్‌ల‌ను శాషేలుగా ఎందుకు అందిస్తున్నార‌ని కేంద్రం అడ‌గ్గా, అందుకు మ‌రికో స్పందిస్తూ.. స‌ద‌రు శాషేలు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు, విద్యార్థుల‌ను ఉద్దేశించి త‌యారు చేసిన‌వ‌ని, వారు ఆయిల్‌ను త‌క్కువగా వంట‌ల్లో వాడుతారు క‌దా, క‌నుక వారికి భారీ ప్యాకెట్లు అవ‌స‌రం లేద‌ని, చిన్న ప్యాకెట్లు చాల‌ని, అందుకే వాటిని అలా చిన్న ప్యాక్‌ల‌లో త‌యారు చేస్తామ‌ని మ‌రికో చెప్పింది. కానీ.. చెప్పేవి శ్రీ‌రంగ నీతులు.. దూరేవి.. గుడిసెలు.. అన్న‌ట్టుగా ఆ కంపెనీ మాత్రం మ‌న‌కు యాడ్‌ల‌లో పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్‌ను హెయిర్ ఆయిల్ అనే చూపిస్తుంది క‌దా. ఇదంతా ఓ జిమ్మిక్కు మ‌రి. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు కొత్త ప్లాన్‌. అయినా ఏం చేస్తాం. ఇలాంటి లొసుగులు ఉండ‌బ‌ట్టే క‌దా ఎంతో మంది, ఎన్నో కంపెనీలు ట్యాక్స్ ల‌ను ఎగ్గొడుతున్నది. వీటికి ట్యాక్స్‌లు ప‌డేలా చ‌ట్టాల‌ను మార్పు చేస్తే త‌ప్ప ఇలాంటి ఘ‌ట‌న‌లు ఆగ‌వు. ఏం చేస్తాం.. అంతా.. మ‌న ప్ర‌భుత్వాల ఖ‌ర్మ మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top