కొబ్బ‌రికాయకు నిజంగా లావాను ఆప‌గ‌లిగే శ‌క్తి ఉందా..? అవునో, కాదో తెలియాలంటే ఈ ప్ర‌యోగాన్ని చూడాల్సిందే..!

అగ్ని పర్వ‌తాలు, వాటిలో విస్ఫోట‌నం చెందే లావా గురించి తెలుసుగా! దాదాపుగా ఎలాంటి ప‌దార్థ‌న్న‌యినా క‌రిగించి బూడిద చేసే అత్యంత అధిక ఉష్ణోగ్ర‌త ఆ లావాలో ఉంటుంది. ఈ క్ర‌మంలో దానికి ఎదురు వెళ్తే ఇక అంతే సంగ‌తులు. మృత్యువును కోరి కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంది. సృష్టిలోని దాదాపు ఏ ప‌దార్థ‌మూ ఆ లావాను ఆప‌లేదు. కానీ దాన్ని ఆపే శ‌క్తి ఒక్క ప‌దార్థానికి ఉంది. అదే కొబ్బ‌రి. అవునా, అని ఆశ్చ‌ర్య‌పోకండి. మీరు విన్న‌ది నిజ‌మే.

copper-coconut

కొబ్బిరికాయ‌లు, వాటిలో ఉండే నీరు మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగిస్తాయ‌ని మ‌న‌కు తెలుసు. అయితే కేవ‌లం అవే కాదు. కొబ్బ‌రికాయ‌లతో మ‌రో ఆశ్చ‌ర్యక‌ర‌మైన ఉప‌యోగం కూడా ఉంది. అదేమిటంటే ఆ కాయ‌లు ఎంత ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లో ఉన్న లావానైనా త‌ట్టుకుని ఇట్టే నిల‌బ‌డ‌గ‌ల‌వు. ఆశ్చ‌ర్య‌పోయినా మీరు ఇది న‌మ్మక త‌ప్ప‌దు. ఓ యూట్యూబ్ ప్రియుడు చేసిన ప్ర‌యోగ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ.

Tito4re పేరిట యూట్యూబ్‌లో ఓ చాన‌ల్‌ను న‌డుపుతున్న ఔత్సాహికుడు కొబ్బ‌రికాయ‌, మండుతున్న లావాపై వినూత్న ప్ర‌యోగం చేశాడు. కాగా అత‌ను ముందుగా ఓ కొబ్బ‌రికాయ‌ను తీసుకున్నాడు. దానికి డ్రిల్ మిష‌న్ స‌హాయంతో డ‌బ్బా మూత లాంటి చిన్న రంధ్రం చేశాడు. అందులోంచి కొబ్బ‌రికాయ‌లో ఉన్న నీటినంతా తీశాడు. అనంత‌రం ఓ చిన్న ఫ‌ర్నేస్‌లో కొద్దిగా రాగిని లావా రూపంలోకి క‌రిగించి దాన్ని ఆ కొబ్బ‌రికాయ‌లో మెల్లిగా పోశాడు. అలా పోసే క్ర‌మంలో ఆ కొబ్బ‌రికాయ నుంచి మంట‌లు రావ‌డం ప్రారంభించాయి. అయినా తాను క‌రిగించిన రాగి మొత్తాన్ని అందులో పోసేశాడు. అప్పుడు దాని నుంచి మంట‌లు ఇంకా ఎక్కువ‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ కాయ‌లోప‌ల పోసిన లావా ఏ మాత్రం బ‌య‌టికి రాలేదు స‌రిక‌దా కాయ చుట్టూ మందంగా ఉన్న టెంక కూడా ఏమాత్రం ప‌గ‌ల‌లేదు. అనంత‌రం అత‌ను ఆ కాయ‌లో నీటిని పోసి ఆ లావాను (క‌రిగిన రాగిని) చ‌ల్లార్చాడు. దీంతో ఆ రాగి గ‌ట్టిప‌డింది. అప్పుడు ఆ రాగిని బ‌య‌ట‌కు తీసి తూకం వేయ‌గా దాని బ‌రువు 3 పౌండ్ల 14 ఔన్సులు (1.757 కిలోలు) వ‌చ్చింది. అంటే ఒక కొబ్బ‌రికాయ దాదాపు 1.75 కిలోల లావాను ఆప‌గ‌ల‌ద‌న్న‌మాట‌. చూశారా! ఆ వ్య‌క్తి ప్ర‌యోగం వ‌ల్ల ఎంత విలువైన విష‌యం తెలిసిందో. మీకు ఈ విష‌యంపై ఇంకా న‌మ్మ‌కం లేక‌పోతే ఆ వ్య‌క్తి చేసిన ప్ర‌యోగాన్ని కింద ఇచ్చిన యూట్యూబ్ వీడియోలో వీక్షించ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top