కోక‌కోలా…. ఎక్క‌డి నుండి వ‌చ్చింది? దానికి ఆ పేరు ఎలా వ‌చ్చింది?

పెంబర్‌టన్ అనే ఓ ఫార్మాసిస్ట్ రకరకాల పానియాలను తయారు చేస్తుండేవాడు..ఆ క్ర‌మంలో కోకా ఆకుల‌ను ఉప‌యోగిస్తూ అత‌డు త‌యారుచేసిన వైన్ కు ఆ రోజుల్లో ప‌శ్చిమ దేశాల్లో మ‌స్త్ డిమాండ్ ఉండేది. దీనికే ఫ్రెంచ్ వైన్ అని పేరు పెట్టి వెస్ట్ర‌న్ కంట్రీస్ అంత‌టా అమ్మేవారు. అన‌తికాలంలోనే పెంబ‌ర్ ట‌న్ కోటీశ్వ‌రుడ‌య్యాడు…..కానీ 1885 లో అట్లాంటాలో మత్తుపానీయాలను నిషేధించారు. మ‌త్తు పానియాల జాబితాలో పెంబర్‌టన్ ఫ్రెంచ్ వైన్ కూడా ఉండ‌డంతో…అదికూడా నిషేదానికి గురైంది.! ఈ దెబ్బ‌తో పెంబ‌ర్ ట‌న్ రాబ‌డి మొత్తం త‌గ్గిపోయింది.

అప్ప‌టికే…అనేక ర‌కాల పానియాల‌ను త‌యారు చేయ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ అయిన పెంబ‌ర్ ట‌న్ ఓ కొత్త పానియం త‌యారీలో నిమ‌గ్నమ‌య్యాడు…అనేక కాంబినేష‌న్స్ ను త‌యారు చేసి రుచి చూశాడు… అవేవీ అత‌నికి సంతృప్తినివ్వ‌లేదు…చివ‌ర‌గా
కోకా ఆకులకు,  కోలా నట్‌ను కలిపి, దానికి చక్కెర, సిట్రిక్ ఆసిడ్ మరికొన్ని సుగంధ ద్రవ్యాలను జత చేసి మే 8, 1886 న కోకో కోలా ను త‌యారు చేశాడు… అటు త‌ర్వాత అది మార్కెట్ లోకి రిలీజ్ అయ్యి….ప్ర‌పంచ‌మంత‌టా విస్తృత ప్ర‌చారం పొందింది. కోక్ లేదా…? అయితే తినేదేమీ లేదు అన్నంత‌గా దాని వాడ‌కం పెరిగిపోయింది.

  • COCA- కోకా ఆకులు

  • COLA- కోలా గింజ‌లు.

Comments

comments

Share this post

scroll to top