నాగుపాము నీళ్లు తాగడం లో వింత ఉండదు…! కానీ “బాటిల్ వాటర్” తాగింది అంటే వింతే కదా! వీడియో మీరే చూడండి!

పామును చూస్తే చాలు ఆమ‌డ దూరం ప‌రిగెడుతాం. అదే నాగుపామే ప్ర‌త్య‌క్ష‌మైతే ఇక ఆ ప‌రిస‌రాల్లోనే జ‌నం క‌నిపించ‌రు. అంత‌లా ఈ విష‌పూరిత పాముల‌కు భ‌య‌ప‌డ‌తారు. కానీ క‌ర్నాట‌క రాష్ట్రంలోని కైగా ప‌ట్ట‌ణంలో మాత్రం ఓ పేద్ద నాగుపాము నీళ్లు తాగింది. నీళ్లు తాగ‌టంలో వింతేముంది అంటారా..? వాటర్ బాటిల్‌తో ఒక వ్య‌క్తి నీళ్లు ప‌డుతుంటే ఎంచ‌క్కా ప‌డ‌గ విప్పి నోటితో తాగింది. సామాన్యంగా జ‌న‌సంచారంలోకి వ‌చ్చేందుకు భ‌య‌ప‌డే పాములు… చుట్టుప‌క్క‌ల జ‌నం గుమికూడి ఉన్నాకూడా ఈ పాము ముందు దాహం తీర్చుకునేందుకే ప్రాధాన్య‌త ఇచ్చింది.

కైగా ప‌ట్ట‌ణంలో క‌రువు తాండ‌వం చేస్తోంది. తాగేందుకు మంచి నీటి దొర‌క్కా ప్ర‌జ‌లు ఎలా అయితే ఇబ్బందులు ప‌డుతున్నారో అక్క‌డి జంతువులు కూడా నీరులేక అల్లాడి పోతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ 12 అడుగులు పాము నీటికోసం త‌చ్చాడుతుండ‌గా అక్క‌డి స్థానికుడు ఒక వాట‌ర్ బాటిల్‌తో నీళ్లు అందించాడు. అయితే పాము సంగ‌తి తెలిసిన ఆ వ్య‌క్తి.. నీళ్లు ప‌ట్టే స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాడు. విషయాన్ని అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి.. ఆ పామును అధికారులు ప‌ట్టుకుని జంతుసంరక్ష‌ణ శాల‌కు త‌ర‌లించారు. అక్కడ కూడా మళ్లీ నీళ్లు తాగించారు. పాము నీళ్లు తాగుతూ గుటకలు వేయటం వీడియో స్పష్టంగా కనిపించింది. ఆ వీడియో నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top