బహిరంగ సభలో ముఖ్యమంత్రికి ముద్దు పెట్టిన మహిళ!

బహిరంగ సభలో పాల్గొన్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుగ్గపై ఓ మహిళ ముద్దుపెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  బెంగుళూరులో జరిగిన కురుబా సామాజిక వర్గం ప్రజాప్రతినిధుల సన్మానకార్యక్రమం జరిగింది. కర్నాటక సిఎం కూడా కురుబా సామాజిక వర్గం చెందినవాడే కావడంతో ఆయన కూడా ఈ వేడకకు వచ్చాడు.ఆ సందర్భంగా చిక్ మంగుళూర్  కు చెందిన పంచాయితీ సభ్యురాలైన గిరిజ ఆయనను సన్మానించారు. సన్మాన కార్యక్రమం అనంతరం గిరిజ  ముఖ్యమంత్రి బుగ్గపై ముద్దుపెట్టారు.

ఈ ఘటనపై సిఎం స్పందించేలోగా..ఆమె స్టేజ్ దిగి వెళ్ళిపోయారు. అనంతరం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ..సిద్ధరామయ్య తనకు తండ్రిలాంటివారని, ఆయనను తొలిసారి కలవడంతో ఆనందానికి లోనై ఇలా చేశానని వివరణ ఇచ్చారు గిరిజ.తనది సిద్దరామయ్య నియోజకవర్గమేనని తెలిపింది.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top