క్లినికల్ ట్రయల్ కంపెనీ నిర్వాకంపెళ్లి కాకుండానే గర్భవతి అయిన యువతి…

డబ్బుకు ఎర వేసి కొన్ని ఫార్మా కంపెనీలు చేసే ఆగడాలు అంతా ఇంతా కాదు. మొన్నటికి మొన్న ఓ యువకుడికి డబ్బు ఆశ చూపి క్లినికల్ ట్రయల్స్ కి ఒప్పించారు. అయితే అది కాస్త వికటించడంతో విషయం బయటికి పొక్కింది. జంతువుల మీద ప్రయోగించాల్సిన క్లినికల్స్ ట్రాయల్స్ దర్జాగా మనుషులపైనే చేస్తూ బారి ప్రాణాలతో చెలగాటమడుతున్నాయి.

 

తాజాగా మరో క్లినికల్ ట్రాయల్స్ నిర్వాకం బయటపడింది హైదరాబాద్ లో ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ నిర్వాకం వలన ఓ యువతి పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది. ఈ కంపెనీలు యువతులకి డబ్బులు ఆశ చూపించి వారి మీద క్లీనికల్ ట్రయల్స్ చేసి వారి నుంచి ఆండాలని సేకరించి చట్ట విరుద్ధంగా అమ్ముకుంటుంటారు. ఒక్కో సారి ఇలాంటి క్లీనికల్ ట్రయల్స్ ఫెయిల్ అవుతూ వుంటాయి. ఈ ట్రయల్స్ వికటించినప్పుడే ఇటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. లేదంటే సందట్లో సడెమియాలగా వారి ట్రయల్స్ ని కొనసాగిస్తూ ఉంటారు.

కామారెడ్డికి చెదిన విజయలక్ష్మి అనే యువతీ ఓ ప్రైవేట్ కంపనిలో జాబ్ చేస్తుంది. ఓ వ్యక్తి ఆమెకి డబ్బులు ఆశ చూపించి క్లీనికల్ ట్రయిల్ కి ఒప్పించారు. దీంతో ఆమె ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ కి వెళ్లి క్లీనికల్ ట్రైల్స్ చేయించుకుంది. దాని కోసం ఆమెకి దళారులు ఇరవై వేల రూపాయిలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక్కడి వరకు ఎవ్వరికి తెలియకుండా క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ జరిగింది. ఉన్నట్టుండి కొన్ని రోజులకి ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్ లో చేర్పించారు. దీంతో ఆమె గర్భవతి అయినట్లు డాక్టర్స్ గుర్తించారు. దింతో ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అయితే ఇదంతా క్లీనికల్ ట్రయిల్ వలన జరిగినట్లు డాక్టర్లు అనుమానిస్తున్నారు. అంతే కాక ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇటువంటి కంపెనీలపై చర్యలు తీసుకోవాలి లేదంటే మున్ముందు ఇంకా ఎన్ని జరుగుతాయో ఏమిటో?

 

Comments

comments

Share this post

scroll to top