చదివింది 3వ తరగతి…అయితేనేం సొంత మేధస్సుతో హెలికాప్టర్ ను రూపొందించాడు.

జీవితంలో సాధించాలన్న తపన ఉండాలే గానీ అందుకు చదువు, డబ్బు అడ్డుకాదని నిరూపించాడు 3వ తరగతి చదువుకున్న సాగర్ ప్రసాద్ శర్మ. అస్సాంలోని ధేమాజీ జిల్లాలోని దిమో గ్రామానికి చెందిన సాగర్ ప్రసాద్ శర్మ 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. తన ఊర్లోనే వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. అయితే ఎప్పటికైనా తనే ఒక చాపర్ ను తయారుచేయాలని శర్మ జీవిత లక్ష్యం.అలా మూడేళ్ళు హెలికాప్టర్ ను సొంతంగా తయారుచేసుకోవడానికి కష్టపడ్డాడు. తనకు తెలిసిన విద్యతో ఆ హెలికాప్టర్ ను ఫైనల్ స్టేజ్ కు తీసుకువచ్చాడు. దీన్ని తయారుచేయడానికి తన భార్య జన్మనీ మయానక్ మరియు అతడి స్నేహితుడు సహాయం చేశారట.

12642659_859596074170113_6264802044874148339_n

ఈ హెలికాప్టర్ ను తయారుచేయడానికి సాగర్ ప్రసాద్ శర్మకు రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యిందట. అయితే హెలికాప్టర్ ను తయారుచేస్తున్నానని కొందరికి చెప్పగా అతడి మాటలు విని నవ్వుకున్నారట.అతడిని ఎవరూ నమ్మలేదట. ఎవరేమనుకున్నా తన కలను నిజం చేసుకోవడం కోసం దేన్నీ లెక్కచేయకుండా తన లక్ష్యమే ముఖ్యమని చెబుతున్నాడు. కాగా దీనికి ‘పవన పుత్ర’ అనే పెట్టాడు. ఇంకొన్ని రోజులలో ఈ చాపర్ ఆకాశంలో విహరించనుంది. సాదించాలన్న సంకల్పం ఉంటే విజయం సొంతం అవుతుందనడానికి సాగర్ ప్రసాద్ శర్మే నిదర్శనం. అతడే మనకు మార్గదర్శి.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top