ఆ 10వ తరగతి అమ్మాయి స్కూల్ ఎగ్గొట్టి, బస్సు ఎక్కి “రాహుల్” ని కలవడానికి వచ్చింది..! “రాహుల్” ఏం చేసాడు?

మ‌న దేశంలో సినిమా స్టార్లు, క్రికెటర్లు, ఇత‌ర సెల‌బ్రిటీల‌కే కాదు, పొలిటిషియ‌న్స్‌కు కూడా అభిమానులు ఉంటారు. త‌మ అభిమాన నాయ‌కుడు వ‌స్తున్నాడంటే అత‌న్నిచూసేందుకు ఎగ‌బ‌డ‌తారు. వారితో మాట్లాడాల‌ని, ఫొటో దిగాల‌ని కూడా అనుకుంటారు. ఇది స‌హ‌జ‌మైన విష‌య‌మే. అయితే మన దేశంలో ఎక్కువ సంఖ్య‌లో అభిమానులు క‌లిగిన నేత రాహుల్ గాంధీ అంటే కూడా చాలా మందికి ఇష్ట‌మే. అందులో భాగంగానే ఓ బాలిక రాహుల్‌ను చూసేందుకు, ఆయ‌న‌తో క‌లిసి ఫొటో దిగేందుకు ఏకంగా స్కూల్‌కే ఆ రోజు సెల‌వు పెట్టింది. ఎట్ట‌కేల‌కు త‌న ఆశ‌ను నెర‌వేర్చుకుంది.

అది భ‌రుచ్‌. గుజ‌రాత్‌లోని ఓ టౌన్‌. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి బాగా ఉంది. మ‌రికొద్ది రోజుల్లో ఎల‌క్ష‌న్లు రాబోతున్నాయి. దీంతో నేత‌లంద‌రూ గుజ‌రాత్‌లో మ‌కాం వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అయితే రోడ్ షో కూడా నిర్వ‌హిస్తున్నారు. కాగా ఈ మ‌ధ్యే ఆయ‌న భ‌రుచ్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. కాగా రాహుల్ వ‌స్తున్న‌ట్టు ఆ టౌన్ ప్ర‌జ‌ల‌కు ముందే తెలుసు. దీంతో అదే టౌన్‌కు చెందిన మంటాషా అనే బాలిక రాహుల్‌ను చూసేందుకు ఏకంగా స్కూల్‌కే లీవ్ పెట్టేసింది. అక్క‌డే ఉన్న ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లో మంటాషా 10వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది.

ఇందులో భాగంగానే రాహుల్ రాక గురించి తెలుసుకున్న మంటాషా ఒక రోజు స్కూల్‌కు సెల‌వు పెడ‌తాన‌ని తండ్రిని అడిగింది. అందుకు అత‌ను ఒప్పుకున్నాడు. ఇంకేముందీ, ఎగిరి గంతేసింది. సెల‌వు పెట్టేసింది. రాహుల్ రోడ్ షో నిర్వ‌హిస్తున్న‌ప్పుడు ఆయ‌న వ్యాన్‌కు ఆమె ద‌గ్గ‌ర‌గా వెళ్లింది. ఈ క్ర‌మంలో రాహుల్ మంటాషాను చూసి వ్యాన్ పైకి పిలిచారు. అనంత‌రం మంటాషా సంబరంగా ఫీలై వ్యాన్ ఎక్కి రాహుల్‌తో సెల్ఫీ తీసుకుంది. ఈ క్ర‌మంలో ఆమె స్కూల్‌కు సెల‌వు పెట్టిన విషయం రాహుల్ తెలుసుకున్నారు. వెంట‌నే రాహుల్ స్పందించి.. చ‌క్క‌గా చ‌దువుకోవాల‌ని మంటాషాకు చెప్పాడు. దీంతో ఈ ఘ‌ట‌న కాస్తా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అక్క‌డి మీడియా చాన‌ల్స్ అన్నీ ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌సారం చేశాయి కూడా. అనేక మంది చాన‌ళ్లు, ప‌త్రిక‌ల వారు మంటాషాను ఇంట‌ర్వ్యూ చేశారు. దీంతో ఆమె ఇప్పుడ‌క్క‌డ పాపుల‌ర్ అయిపోయింది..!

Comments

comments

Share this post

scroll to top