సివిల్స్ ను చిత్తు చేసిన వికలాంగురాలు..నిజంగా నువ్వు స్పూర్తిప్రదాతవు.

సాధించాలి అనే పట్టుదల ఉండాలే కానీ, అంగ వైకల్యం అడ్డుకాదని నిరూపించింది,  హీరా సింఘాల్… జన్మతహా వికలాంగురాలైన హీరా  అత్యున్నత సివిల్స్ పరీక్షను చిత్తు చేసింది. ఏకంగా జాతీయ స్థాయిలో మొదటి స్థానం సంపాధించింది హీరా.. మనల్ని మనం తక్కువ అనే భావన తొలగించుకోవాలని చెప్పింది… నా విజయమే దీనికి నిదర్శనం అని చెప్పిందామె.

ఒక్కసారి కాదు సివిల్స్ కోసం ఇది నా 6వ ప్రయత్నం  అని ఆమె చెప్పారు. 2014 నుండి సివిల్స్ కు ప్రిపేర్ అవుతన్నట్టు తెలిపారు.. షార్ట్ కట్స్ కోసం వెంపర్లాడే చాలా మందికి హీరా నిరంతర ప్రయత్నం ఓ పాఠం

heera singhaal

ఇది సివిల్స్ పరీక్షలోనే  ఓ రికార్డ్,  ఇంత వరకు మొదటి ర్యాంక్  వికలాంగులరాలికి రావడం ఇదే ప్రథమం. ఇక తనలాంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ఏదైనా చేయాలనుంది అని అన్నారు హీరా. కూతురు టాప్ ర్యాంక్ సాధించిందని తెలిసిన ఇరా తల్లిదండ్రులు పట్టరాని సంతోషంలో ఉన్నారు. ఇరా స్నేహితులు కూడా ఆమె సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. Congratulation Heera Singhal.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top