సినిమాల్లో న‌టించాల‌ని చెప్పి హైద‌రాబాద్ నుంచి ముంబై వెళ్లింది ఆ బాలిక‌.. త‌ర్వాత ఏమైందంటే..?

నిజంగా నేటి త‌రుణంలో పిల్ల‌లు ఎలా త‌యార‌య్యారంటే ఏది అనుకుంటే అది చేస్తున్నారు. తెలిసీ తెలియ‌ని వ‌య‌స్సులో త‌ప్పులు చేస్తుండ‌డం వ‌ల్ల త‌ల్లిదండ్రుల‌కు స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డుతున్నాయి. దీంతో అలాంటి త‌ల్లిదండ్రుల‌కు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. ఇటీవ‌ల హైద‌రాబాద్ న‌గ‌రంలో ఓ కుటుంబం ప‌రిస్థితి కూడా అలాగే మారింది. రోజూ లాగే స్కూల్‌కు వెళ్లిన త‌మ కూతురు సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో త‌ల్లిదండ్రులు కంగారు ప‌డ్డారు. అయితే ఆ కంగారు ఎక్కువైంది. రోజులు గ‌డుస్తున్నా త‌మ కూతురు జాడ తెలియ‌లేదు. దీంతో వారు ప‌డిన ఆవేద‌న అంతా ఇంతా కాదు. అయితే చివ‌ర‌కు వారికి త‌మ పాప ల‌భించ‌డంతో క‌థ సుఖాంతం అయింది.

హైద‌రాబాద్ న‌గ‌రంలోని బాచుప‌ల్లిలో నివాసం ఉంటున్న నాగ‌రాజు అనే వ్య‌క్తికి ఇద్ద‌రు కుమార్తెలు. పెద్ద కూతురు పూర్ణిమ ఓ ప్రైవేటు స్కూల్‌లో 10వ త‌రగ‌తి చ‌దువుతోంది. అయితే పూర్ణిమ గ‌త 40 రోజుల కింద‌ట ఓ రోజున ఇంటి నుంచి బ‌య‌ల్దేరి య‌థావిధిగా స్కూల్‌కు వెళ్తున్నాన‌ని చెప్పింది. అయితే ఆ రోజు ఆమె సాయంత్రం ఇంటికి రాలేదు. దీంతో త‌ల్లిదండ్రులు కంగారు ప‌డ్డారు. ఆందోళ‌న మొద‌లైంది. ఈ క్ర‌మంలో వారు స్థానిక పోలీసుల‌కు కంప్లెయింట్ కూడా చేశారు. అయితే రోజులు గ‌డుస్తున్నా పూర్ణిమ ఆచూకీ తెలియ‌లేదు. దీంతో ఆమె త‌ల్లిదండ్రులు ప‌డిన బాధ‌ను మాటల్లో చెప్ప‌లేం.

అయితే సైబ‌రాబాద్ పోలీసులు ప్ర‌త్యేక బృందాల‌తో కేసు విచార‌ణ మొద‌లు పెట్ట‌డంతో ఎట్ట‌కేల‌కు పూర్ణిమ ఆచూకీ ల‌భించింది. ఆమె ముంబై వ‌ద్ద క‌నిపించిన‌ట్టు ఓ ఎన్‌జీవో చెప్ప‌గా అక్క‌డికి సైబ‌రాబాద్ పోలీసులు వెళ్లి పాపను తీసుకొచ్చారు. దీంతో రోజుల త‌ర‌బ‌డి క‌నిపించ‌కుండా పోయిన త‌మ కూతురు దొరికేస‌రికి ఆ త‌ల్లిదండ్రుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అయితే పూర్ణిమ అలా ముంబై ఎలా వెళ్లింది, ఎవ‌రైనా తీసుకెళ్లారా..? అన్న కోణంలో పోలీసులు ప్ర‌శ్న‌లు అడ‌గ్గా అందుకు పూర్ణిమ షాకింగ్ స‌మాధానం చెప్పింది. త‌న‌కు సినిమాల్లో న‌టించ‌డం అంటే ఇష్ట‌మ‌ని, అందుకే ముంబై వెళ్లాన‌ని చెప్పే స‌రికి పోలీసుల‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది..! చూశారుగా.. పిల్ల‌లు ఎంత‌కు తెగిస్తున్నారో. వారిని 24 గంట‌లూ ప‌ర్య‌వేక్షించాల్సిన బాధ్య‌త మాత్రం ఇప్ప‌టి త‌రం త‌ల్లిదండ్రుల‌పై ఉంద‌ని చెప్పేందుకు ఈ సంఘ‌ట‌న ఓ నిద‌ర్శ‌నం మాత్ర‌మే..!

40 రోజుల నుంచి కనపించకుండా పోయిన కూతురిని తీసుకొద్దామని ఎంతో ఆతృతతో ముంబై వెళ్లిన తల్లిదండ్రులను చూడ్డానికి కూడా ఇష్టపడలేదు పూర్ణిమ. పేరంట్స్ తో వచ్చేందుకు నిరాకరిస్తోంది. పూర్ణిమ ప్రవర్తనతో తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. ఎందుకు ఇలా మాట్లాడుతుందో.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. నా మొహం చూస్తే తల్లిదండ్రులకు హాని జరుగుతుందని.. కీడు వస్తుందని కల వచ్చిందని, అందుకే ఏడాదిపాటు తల్లిదండ్రులకు దూరంగా ఉంటానని పూర్ణిమ చెబుతోంది. పూర్ణిమ ప్రవర్తనపై NGO సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చినా మంకు పట్టు వీడటం లేదు. తల్లిదండ్రుల వెంట వెళ్లేది లేద‌ని ముంబైలోని బాలల సంరక్షణ కమిటీ అధికారులకు తెగేసి చెప్పింది. పూర్ణిమను ఎంత బతిమాలినా మొండికేయడంతో తల్లిదండ్రులకు ఏంచేయాలో పాలుపోవడం లేదు.

Comments

comments

Share this post

scroll to top