“అ” సినిమా షేర్ & గ్రాస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా.? నానికి లాభమా.? లేక నష్టమా.?

భిన్నమైన కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన చిత్రం ‘అ!’. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నేచుర‌ల్ స్టార్ నాని  స‌మ‌ర్ప‌కుడుగా,యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్‌, ఈషా రెబ్బా, రెజీనా, ప్రియ‌ద‌ర్శి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.హాలివుడ్ రేంజ్ లో ఉందనే టాక్ వినిపిస్తుంది..తెలుగులో డివైడ్ టాక్ వినిపిస్తున్న  అ మూవీ..ఓవర్సీస్ లో మాత్రం దూసుకుపోతుంది.

 భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అ! చిత్రం ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను రాబడుతున్నది. అమెరికాలో ఈ చిత్రం హాఫ్ మిలియన్ దిశగా దూసుకెళ్తున్నది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 21వ స్థానంలో నిలువడం విశేషం.అమెరికాలో అ! చిత్రం ప్రీమియర్ ప్రదర్శనకు మంచి స్పందన లభించింది. గురువారం ఈ చిత్రం 126851 డాలర్లను వసూలు చేసింది. శుక్రవారం 140629 డాలర్లను కలెక్ట్ చేసింది.ఈ సినిమా నిర్మాణం కోసం నాని ఖర్చు పెట్టింది ఆరు కోట్లు కాగా.. అ! చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3.6 కోట్ల గ్రాస్ వసూళ్లను, 1.7 కోట్ల నికర కలెక్షన్లను సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 1.5 కోట్ల గ్రాస్, 90 లక్షల షేర్‌ను సాధించింది. ఇక ప్రాంతాల వారీ పరిశీలిస్తే…నైజాంలో 38 లక్షల షేర్, వైజాగ్‌లో 11 లక్షలు, తూర్పు గోదావరిలో 7 లక్షలు, పశ్చిమ గోదావరిలో 6 లక్షలు, కృష్ణా జిల్లాలో 9 లక్షలు, గుంటూరులో 8. నెల్లూరులో 2 లక్షలు సాధించింది.కాజల్,రెజీనా,నిత్యా,ఈషా రెబ్బా,అవసరాల శ్రీనివాస్,ప్రియదర్శి ఎవరికి వారే తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమా ప్రారంభం నుండి అర్దం కానట్టుగా సాగే కథనం చివరి పదినిమిషాల్లో సినిమా మొత్తాన్ని ప్రేక్షకుల ముందుంచి హాలివుడ్ సినిమాలను తలపించిన అ మూవీ బి,సి వర్గాలను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు..మల్టిప్లెక్స్ ప్రేక్షకులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు.

Comments

comments

Share this post

scroll to top