రేపే వర్మ “జీఎస్టీ” రిలీజ్…సినిమా చూడాలంటే షరతులు ఏంటో తెలుసా.? ఏజ్ రిస్ట్రిక్షన్ కాదండోయి!

రాంగోపాల్ వర్మ,సంచలనం పర్యాయపదాలు..తను తీసే సినిమాలు హిట్టవుతాయో లేదో కానీ సినిమాకు ముందు మాత్రం వివాదాలతో ఎప్పుడూ మార్కెట్లో ప్రజల్లో నానుతూ ఉంటాడు..పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో   రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా గాడ్ సెక్స్ ట్రూత్.విడుదలకు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.ఇప్పటికే ఈ సినిమా విషయంలో రాంగోపాల్ వర్మపై పలు కేసులు నమోదయ్యాయి..అయితే  దీనిపై వర్మ ట్విట్టర్‌లో ఓ ఆసక్తికర సర్వేను నిర్వహించారు…అదేంటంటే మోడీ జిఎస్టీ,వర్మ జిఎస్టీలో ఏది ఎక్కువ అని ఒక పోటిపెడితే ఎక్కువ మంది మియామాల్కోవాకే ఓట్లేసారు.. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో జీఎస్‌టీని చూడాలంటే కొన్ని దేశాల్లో ఆయా దేశాల కరెన్సీ ప్రకారం అమౌంట్ చార్జ్ చేస్తామంటూ వర్మ ఆ అమౌంట్ వివరాలతో కూడిన పట్టికను ట్విట్టర్‌లో ఉంచారు. వర్మ ట్వీట్ ఆయన మాటల్లోనే…
‘‘జనవరి 26న ఉదయం 9గంటలకు రిలీజ్ కాబోయే గాఢ్ సెక్స్ ట్రూత్ సినిమాను ఆన్‌లైన్‌లో చూడాలంటే చార్జ్ చేయాల్సిన అమౌంట్‌ను యూఎస్ ప్రొడక్షన్ కంపెనీ నిర్ణయించింది.ప్రేక్షకులు ఆ సినిమాను చూడాలంటే ఎంత అమౌంట్ చెల్లించాలో తెలుసా..?
ప్రేక్షకులు చెల్లించాల్సిన అమౌంట్ ఆ దేశపు కరెన్సీలో..
ఇండియా                           – 150 రూపాయలు
శ్రీలంక                               – 200 రూపాయలు
పాకిస్థాన్                           – 200 పాకిస్తానీ రుపీ
బంగ్లాదేశ్                          – 150 టాకా
యూఏఈ                         – 9.99 దీరమ్స్
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్    – 2.99 డాలర్లు
యూఎస్, కెనడా                 – 2.99 డాలర్లు
యూరప్                            – 1.99 యూరోలు
ప్రతి దేశానికి సబ్‌స్ర్కిప్షన్ ఆ దేశపు రెగ్యులేషన్స్‌కు అనుగుణంగా మారుతూ ఉంటుంది.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు వర్మ.అంతేకాదు ఇకపై డిజిటల్ మీడియా వేదికగా ఆర్జీవీ విడుదల చేసే వెబ్ సిరీస్ ఎపిసోడ్స్‌కు, షార్ట్ ఫిలిమ్స్‌కు కూడా ఇలాగే చార్జ్ చేయాలని భావిస్తున్నారట.

Comments

comments

Share this post

scroll to top