బాబోయ్‌.. ఆ సినిమాకు 48 కట్స్ చెప్పార‌ట సెన్సార్ వారు..! ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే..?

బాబుమొషాయ్ బందూక్‌బాజ్‌… ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీ న‌టించిన చిత్రం. కుశ‌న్ నంది ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఇది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా విడుద‌ల కానుంది. అయితే ఇప్ప‌టికే ట్రైలర్‌తో సినిమా ప్రేక్ష‌కుల్లో, ముఖ్యంగా యువ‌త‌లో భ‌లే కిక్ ఎక్కించారు చిత్ర యూనిట్ స‌భ్యులు. ఈ సినిమాకు చెందిన ట్రైల‌ర్‌ను కొన్ని ల‌క్ష‌ల మంది ఇప్ప‌టి వ‌ర‌కు వీక్షించారు. అయితే ఇప్పుడీ సినిమాపై తాజాగా ఓ వివాదం నెల‌కొంది. అది సినిమాలో ఉన్న సీన్స్ గురించి.

ఈ సినిమాలో అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు ఉన్నాయ‌ని సెన్సార్ బోర్డు సినిమాకు 48 క‌ట్స్ వేయాల‌ని చిత్ర యూనిట్‌కు తెలిపింది. స‌ద‌రు 48 స‌న్నివేశాల‌ను తొల‌గిస్తేనే ఫిలిం స‌ర్టిఫికెట్ ఇస్తామ‌ని తేల్చి చెప్పింది. దీంతో చిత్ర ద‌ర్శ‌కుడు కుశ‌న్ నంది అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. త‌న సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చార‌ని, అలాంట‌ప్పుడు అందులో ఉన్న 48 సీన్ల‌ను ఎందుకు తీసివేయాలని ప్ర‌శ్నించారు. ఆ సీన్ల‌ను తీసేస్తే A స‌ర్టిఫికెట్ ఇవ్వ‌కుండా U స‌ర్టిఫికెట్ ఇస్తారా..? అని ప్ర‌శ్నించారు.

కాగా వివాదంపై సెన్సార్ బోర్డు డైరెక్ట‌ర్ ప‌హ్ల‌జ్ నిహ్లానీ స్పందిస్తూ… సినిమాల్లో అభ్యంత‌రక‌ర స‌న్నివేశాలు ఉంటే తొల‌గించడ‌మే త‌మ ప‌ని అని, అలాంటి సీన్ల‌ను తొల‌గిస్తేనే ఏ సినిమాకైనా స‌ర్టిఫికెట్ ఇస్తామ‌ని తెలిపారు. కాగా మొన్నా మ‌ధ్యే ఈయన సినిమాల‌పై వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు. ఇక‌పై సినిమాల్లో మ‌ద్యం సేవించే, పొగ తాగే సీన్లు ఉంటే వాటిని నిర్దాక్షిణ్యంగా క‌ట్ చేస్తామ‌ని, కాదు, కూడ‌దు అంటే ఆ సినిమాల‌కు A స‌ర్టిఫికెట్ ఇస్తామ‌ని చెప్పారు. ఇంతలోనే సెన్సార్ స‌ర్టిఫికెట్‌కు వెళ్లిన Babumoshai Bandookbaaz సినిమాకు ఇలా 48 క‌త్తెర్లు ప‌డ‌డం గ‌మ‌నార్హం. మ‌రి సెన్సార్ వారు సూచించిన‌ట్టుగా సినిమాలో 48 సీన్ల‌లో క‌త్తెర్లు వేసి సినిమాను విడుద‌ల చేస్తారా..? లేదా..? అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా ఇంత పెద్ద స్థాయిలో సినిమాకు క‌త్తెర్లు ప‌డ‌డం అంటే.. ఆ సినిమా నిర్మాత‌ల‌కు కొంత ఇబ్బందిని కలిగించే విష‌య‌మే క‌దా..!

watch video:

Comments

comments

Share this post

scroll to top