సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన టాలీవుడ్ ప్రముఖులు.

నిన్న కన్నడ సినిమా మాస్తిగుడి షూటింగ్ లో జరిగిన అపశృతి కారణంగా నటులు అనిల్, ఉదయ్ లు చనిపోయిన సంగతి తెలిసిందే. గతంలో మన టాలీవుడ్ లో కూడా షూటింగ్ లో జరిగిన పొరపాట్ల కారణంగా కొంత మంది సినిమా ప్రముఖులు చనిపోయారు. ముందు జాగ్రత్త తీసుకోకపోవడం, డూప్ లేకుండా నటించాలని అత్యుత్సాహం ప్రదర్శించడం లాంటి కారణాల వల్ల మన టాలీవుడ్ కూడా కొందమందిని కోల్పోయింది. వారి వివరాలు ఓ సారి చూద్దాం.

  1. గొల్లపూడి శ్రీనివాస రావ్( గొల్లపూడి మారుతీ రావ్ తనయుడు):

గొల్లపూడి మారుతీరావు తనయుడైన శ్రీనివాస రావు దర్శకత్వంలో  ప్రేమ పుస్తకం సినిమా ను  విశాఖపట్నం RK బీచ్ లో  షూట్  చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఎగిసిపడిన అలల ధాటికి కొట్టుకొనిపోయి డైరెక్టర్ శ్రీనివాసరావ్ మరణించారు.  మిగిలిన చిత్రానికి ఆయన తండ్రి దర్శకత్వం వహించారు. శ్రీనివాస రావు మరణాంతరం గొల్లపూడి శ్రీనివాస్ పేరిట సినిమాలకు అవార్ట్ లను ఇస్తూ వస్తున్నారు.

gollapudi-srinivas

2) నూతన ప్రసాద్:

బామ మాట బంగారు బాట అనే సినిమాలో తాత పాత్ర పోషించిన నూతన ప్రసాద్…సూపర్ కార్ తో విన్యాసాలు చేస్తూ ఎత్తునుండి పడి రెండు కాళ్లు కోల్పోయారు.

 

3) రవితేజ డూప్:

బలాదూర్ సినిమా షూటింగ్ లో రాజమండ్రి వద్ద గోదావరి నదిలో పడవ నుండి దూకే క్రమంలో రవితేజ కు డూప్ గా వ్యవహరించిన వ్యక్తి చనిపోయాడు.

Watch Video:

4) కెమెరా మ్యాన్ లోక్ సింగ్:

సినిమా షూట్ చేస్తున్న సమయంలో…కెమెరా మ్యాన్ లోక్ సింగ్ అగ్నిప్రమాదానికి గురై….ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top