మంత్రి నారాయణ ఒంగోలులో కారులో వెళుతుండగా…సడన్ గా కార్ దిగి “అంధగాడు” పోస్టర్ చించేశారు..! ఎందుకో తెలుసా..?

శుక్రవారం ఒంగోలు నగరంకు వెళ్లారు మంత్రి నారాయణ గారు. ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఒంగోలు వెళ్లారు. అక్కడి నగర పాలక సంస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసారు. తనిఖీల సందర్భంగా నగర సుందరీకరణ పనుల నిర్వహణను పర్యవేక్షించిన అనంతరం కమిషనర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన పరిధిలోని శాఖపై ఆయన ఎంతో దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఇటీవల కార్పొరేషన్‌ పాఠశాలలపై సమీక్ష చేస్తూ నువ్వు కమిషనర్‌వా.. కాంట్రాక్టర్‌ వా! అంటూ కమిషనర్‌ వెంకటకృష్ణపై విరుచుకుపడ్డారు.


ఆ తర్వాత ఆయన డీఎంఏ కన్నబాబుతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడికక్కడ గోడలపై పోస్టర్లు అంటించి ఉండటాన్ని చూసిన మంత్రి నేరుగా కారు దిగి కొన్నింటిని తొలగించారు. రాజ్ తరుణ్-హెబ్బాపటేల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అంధగాడు’ సినిమా పోస్టర్‌ను స్వయంగా చించి నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు కన్పించకూడదని కమిషనర్‌ను హెచ్చరించారు.జూన్ 5 న ఆంధ్ర ప్రదేశ్ ను పోస్టర్ రహిత రాజ్యంగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పోస్టర్ అంటించిన వారికి ఫైన్ కూడా వేశారు. రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కూడా ఈ రూల్ వర్తిస్తుంది అంట. అంటించినవారిపై తగిన చర్యలు తీసుకోండి అని డీఎంఏ  కు ఆదేశించారు నారాయణ.

Comments

comments

Share this post

scroll to top