సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల‌పై యాంక‌ర్ ర‌ష్మి సమాధానం.. ఆమె ఏం చెప్పిందో తెలుసా..?

ఇప్పుడంటే గొడ‌వ కాస్త స‌ద్దుమ‌ణిగిన‌ట్లు అనిపిస్తుంది కానీ.. గ‌త కొన్ని రోజుల కిందటి వ‌ర‌కు కూడా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌లపై లైంగిక వేధింపులు, సినీ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై పెద్ద దుమార‌మే చెల‌రేగింది. దీనిపై న‌టి శ్రీ‌రెడ్డి మొద‌ట టీవీ చాన‌ళ్ల‌లో లైవ్ డిబేట్ల‌కు హాజ‌ర‌వుతూ కొంత ప్ర‌చారం తీసుకొచ్చింది. కానీ ఆమె అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేసిన అనంత‌రం ఆమెకు అన్ని వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున స‌పోర్ట్ ల‌భించింది. త‌రువాత ప‌వ‌న్ కల్యాణ్‌పై ఆమె చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఇక ఆ గొడ‌వ గురించి అంద‌రూ మ‌రిచిపోయారు. అయిన‌ప్ప‌టికీ సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్‌పై ఆ రంగానికి చెందిన ప్ర‌ముఖుల‌కు, ముఖ్యంగా హీరోయిన్లు, ఇత‌ర న‌టీమ‌ణుల‌కు ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. సినీ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా, లేదా, దానిపై మీ అభిప్రాయం ఏమిటి, అనే ప్ర‌శ్న‌ల‌ను సినిమా న‌టులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారికి ఆ అంశంపై స‌మాధానాలు చెప్ప‌క త‌ప్ప‌డం లేదు. అందుకు ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో యాంక‌ర్‌, న‌టి ర‌ష్మి గౌత‌మ్ ను కూడా ట్విట్ట‌ర్ చాట్‌లో కొంద‌రు అభిమానులు ఇవే ప్ర‌శ్న‌లు అడిగారు. అయితే అందుకు ఆమె ఏమ‌ని స‌మాధానం చెప్పిందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీల‌పై మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక దాడులు, దోపిడీ గురించి యాంక‌ర్ ర‌ష్మిని ట్విట్ట‌ర్‌లో ప‌లువురు అభిమానులు ప్ర‌శ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. కేవ‌లం సినిమా ఇండ‌స్ట్రీలోనే లైంగిక వేధింపులు, దోపిడీ లేవ‌ని, అన్ని చోట్లా ఈ ఇబ్బందుల‌ను మ‌హిళ‌లు ఎదుర్కొంటున్నార‌ని ఆమె చెప్పింది. ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న మ‌హిళ‌ల‌కు ఇదొక పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని, అయితే ఈ విష‌యంలో కేవలం సినిమా ఇండస్ట్రీనే టార్గెట్ చేసి మాట్లాడ‌డం స‌రికాద‌ని ర‌ష్మి ట్వీట్ చేసింది. ఇక జ‌బ‌ర్ద‌స్త్‌తోపాటు ఇత‌ర టీవీ షోల‌లో యాంక‌ర్ ప్ర‌దీప్‌, క‌మెడియ‌న్ సుధీర్, ఇత‌రులు ర‌ష్మిపై పంచ్ లు వేస్తుంటార‌ని తెలిసిందే. అలాంటి పంచ్‌లు వేసిన‌ప్పుడు కోపం రాదా అని ఆ విష‌యంపై నెటిజ‌న్లు ర‌ష్మిని ప్ర‌శ్నించ‌గా… అందుకు ఆమె బ‌దులిస్తూ.. కోపం ఎందుకు వ‌స్తుంది ? అవి టీవీ షోలు.. అలాగే చేయాలి. అయినా మేము అంతా ఫ్రెండ్లీగా, ఒకే ఫ్యామిలీలా ఉంటాం. అలాంట‌ప్పుడు కోపం ఎందుకు వ‌స్తుంది. అలా పంచ్‌లు వేయ‌కపోతే జ‌నాల‌కు ఎంట‌ర్‌టైన్ మెంట్ ఉండ‌దు అని ర‌ష్మి బ‌దులిచ్చింది.

ఇక వేశ్య పాత్ర‌లు చేస్తే న‌టీమ‌ణుల గౌర‌వం పోతుందా.. అని అడ‌గ్గా.. అందుకు కూడా ర‌ష్మి స‌మాధానం చెప్పింది. వేదం సినిమాలో అనుష్క వేశ్య పాత్ర‌లో న‌టించింది. మంచి న‌టిన‌ని ప్రూవ్ చేసుకుంది. నిజానికి అలాంటి పాత్ర‌లు చేయ‌డం అంత ఈజీ కాదు. ఎంతో శ్ర‌మించాలి. అలాంటి క్యారెక్ట‌ర్స్ న‌టీమ‌ణుల‌కు చాలెంజింగ్‌గా ఉంటాయి. క‌నుక చాలెంజ్‌ను స్వీక‌రించి ఆ పాత్ర‌ల్లో న‌టించాలి. లేదంటే ఆ క్యారెక్ట‌ర్ల‌కు అంత గుర్తింపు రాదు.. అని ర‌ష్మి చెప్పింది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు వేశ్య పాత్ర‌లు రాలేద‌ని, ఒక వేళ వ‌స్తే చాలెంజ్‌గా తీసుకుని న‌టిస్తాన‌ని చెప్పుకొచ్చింది. అలాంటి పాత్ర‌లు చేయాలంటే న‌ట‌న‌లో చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉంటుంద‌ని ర‌ష్మి చెప్పింది.

గుంటూర్ టాకీస్‌లో ర‌ష్మి క్యారెక్ట‌ర్ గురించి ఓ అభిమాని అడ‌గ్గా.. ఆ మూవీలో త‌న పాత్ర కేవ‌లం 15 నిమిషాల పాటు మాత్ర‌మే ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. ఆ పాత్ర‌లో సెక్సీనెస్ ఉంది కానీ, వ‌ల్గ‌ర్‌గా లేద‌ని, అందుకే సినిమా విడుద‌లై ఇప్ప‌టికి రెండేళ్లు గడుస్తున్నా త‌న క్యారెక్ట‌ర్‌ను జ‌నాలు మ‌రిచిపోలేద‌ని ర‌ష్మి తెలియ‌జేసింది. ఆ పాత్ర‌లో ఒక మ్యాజిక్ ఉంద‌ని ఆమె ట్వీట్ చేసింది. ఇక ర‌ష్మి అభిమానుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాక బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. అంటే.. ఆమె గోవాలోనో మ‌రేదైనా బీచ్‌లోనో ఎంజాయ్ చేస్తున్న‌ట్లు మ‌న‌కు క‌నిపిస్తుంది. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌ని ర‌ష్మి మాటల్లో మ‌న‌కు క‌నిపిస్తుంది. అయినా దాన్ని ధైర్యంగా ముందుకు వ‌చ్చి చెప్పే సాహ‌సం చేయాలి క‌దా..!

 

 

Comments

comments

Share this post

scroll to top