ప్లేస్ లు మారుస్తూ,ఊరంతా తిప్పుతూ, ఒకరి తర్వాత ఒకరు వారం పాటు అత్యాచారం.

రాజస్థాన్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల ఓ మహిళపై అత్యంత పాశవికంగా దాడి చేసింది ఓ ముఠా. ఆ మహిళను జీపులో ఎక్కించుకుని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లిన ముగ్గురి ముఠా వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడింది. ప్లేస్ లు మారుస్తూ ఊరంతా తిప్పుతు ఒకరి తరువాత ఒకరు 7 రోజులు పాటు ఆమె దేహన్ని వాడుకున్నారు. అక్కడితో ఆగకుండా ఆమెను ఓ వేశ్యా గృహనికి లక్ష రూపాయలకి అమ్మేశారు. అక్కడ మరో మూడు రోజుల పాటు నరకం చూపించారు కామాంధులు.

gang-rape-india_0

ఎలాగోలా ఆ రాక్షసుల నుండి తప్పించుకుని ఇంటికి వచ్చిన ఆ మహిళకు మరో షాక్ తగిలింది. తను కిడ్నాప్ అయినట్టుగా తెలుసుకున్న భర్త మనస్తాపానికి గురై మూడు రోజుల ముందే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ లోని చురు జిల్లాలో చోటు చేసుకుంది.

ఆ రోజు ఏం జరిగింది..
ఈ నెల 22వ తేదీన అసల్ ఖేరీ బస్టాండ్ వద్ద ఇంటికి వెళ్లేందుకు వేచి ఉంది. అటు వైపుగా వచ్చిన ఓ జీపు భలేరీ పట్టణం వరకు వెళ్తామని చెప్పగానే అందులో ఎక్కింది. అయితే కాసేపటికే ఆ జీపు రూట్ మార్చి ఆ మహిళని మరో ప్రాంతానికి తీసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆమెను బంధించి ఈ ఘోరానికి పాల్పడ్డారని పోలీసుల ముందు వాపోయింది.ఈ ఘటన ఈ నెల 22 న చోటు చేసుకుంది. 22 న ఎత్తుకెళ్లిన ముఠా 28 వరకు ఆ మహిళని చిత్రహింసలకు గురి చేసింది. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే సదరు మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. నిందుతుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అక్కడి పోలీసులు.

Comments

comments

Share this post

scroll to top