కొరియోగ్రాఫర్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శివశంకర్ మాస్టార్…నేను ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో మార్గం లేదంటూ తన బాధను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేశారు . తమ కోడలు తమపై తప్పుడు కేసు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని , 10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తుందని, సొంత ఇంటిని కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తుందని…ఈ విషయంలో ఎలాగైనా తన ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడాలని జయలలితకు విజ్ఞప్తి చేశారు శివశంకర్ మాస్టార్.
శివశంకర్ కుమారుడు విజయకృష్ణ, బెంగుళూరుకు చెందిన జ్యోతిని 2013లో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లకే భార్యభర్తల మద్య గొడవలు స్టార్ట్ అయ్యాయి..ఈ నేపథ్యంలోనే వారిద్దరూ విడాకులు సైతం తీసుకున్నారు. సడెన్ గా తనను మానసికంగా శారీరకంగా హించించారంటూ జ్యోతి…. విజయకృష్ణతో పాటు అత్తింటి వారిపై తనను వేధిస్తున్నారని కేసు పెట్టింది. మీడియా ముందుకొచ్చిన శివశంకర్…తన మాజీ కోడలు తమపై తప్పుడు కేసు బనాయించి మా నుండి డబ్బును ఇంటిని పొందాలని చూస్తుందని…తమను కాపాడాలని తమిళనాడు సిఎం జయలలితకు విన్నవించారు.