200 కిలోల బ‌రువు ఉన్న డ్యాన్స్ మాస్ట‌ర్ గ‌ణేష్ ఆచార్య..85 కిలోలు త‌గ్గారు.! ఎలాగో తెలుసా.? అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నారు.!

అధిక బ‌రువు.. నేటి త‌రుణంలో చాలా మందికి అది బ్ర‌హ్మ ప‌దార్థంగా మారింది. దాన్ని త‌గ్గించుకునేందుకు స్థూల‌కాయులు ప‌డుతున్న వేద‌న అంతా ఇంతా కాదు. బ‌రువు పెర‌గ‌డ‌మైతే పెరుగుతారు కానీ దాన్ని త‌గ్గించుకునేట‌ప్పుడే అస‌లు క‌ష్టం తెలుస్తుంది. ఈ క్ర‌మంలో కొంద‌రు బ‌రువు త‌గ్గ‌క అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. మ‌రికొంద‌రు చాలా స‌క్సెస్‌ఫుల్‌గా బ‌రువు త‌గ్గుతున్నారు కూడా. ఇక సెలబ్రిటీల విష‌యానికి వ‌స్తే వారికి బ‌రువు త‌గ్గడం పెద్ద క‌ష్టం కాదు కానీ.. వారు బ‌రువు త‌గ్గారంటే అది విశేష‌మే అవుతుంది క‌దా. బాలీవుడ్ సెల‌బ్రిటీ, డ్యాన్స్ మాస్ట‌ర్ గ‌ణేష్ ఆచార్య తెలుసు క‌దా. ఎంత బరువుంటాడో పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఈయ‌న ఒక‌ప్పుడు బాగా బ‌రువుండేవారు. కానీ ఈ మ‌ధ్యే చాలా బ‌రువు త‌గ్గారు తెలుసా..!

గ‌ణేష్ ఆచార్య ఒక‌ప్పుడు సుమారు 200 కేజీల బ‌రువుండేవారు. దీంతో ఆయ‌న డ్యాన్స్‌మాస్ట‌ర్‌గా స్టెప్పులు వేయించేట‌ప్పుడు నానా ఇబ్బందులు ప‌డేవారు. అయితే చివ‌ర‌కు ఎలాగైనా బ‌రువు త‌గ్గాల‌ని గ‌త ఏడాదిన్న‌ర కింద‌టి నుంచి తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నాడాయ‌న‌. దీంతో ఇప్పుడు చాలా వ‌ర‌కు బ‌రువు త‌గ్గారు. ఏకంగా 85 కిలోల వ‌ర‌కు గ‌ణేష్ ఆచార్య త‌గ్గాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న తాజాగా ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.

గ‌ణేష్ ఆచార్య అలా ఏకంగా 85 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గి ప్ర‌స్తుతం తీసిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రాంలో పెట్టే స‌రికి అవి ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యాయి. చాలా మంది ఆయ‌న బ‌రువు త‌గ్గ‌డాన్ని స్వాగ‌తిస్తున్నారు. ప‌లు ఇత‌ర బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఆయ‌న్ను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తుతున్నారు. అయితే అది ఇక్క‌డితో ఆగ‌ద‌ని ఇంకా బ‌రువు త‌గ్గాల్సి ఉంద‌ని ఆయ‌న చెబుతున్నారు. నిజంగా వీరు ఇలా బ‌రువు త‌గ్గ‌డం ఏమో గానీ ఇత‌రుల‌కు మాత్రం అది ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top