ఎక్జామ్ రాసొచ్చి ఇంటర్ విద్యార్థిని సూసైడ్..! సెల్ఫీ వీడియోలో ఆమె చివరి మాటలు వింటే కన్నీళ్లొస్తాయి.! [VIDEO]

సారీ మమ్మి… సారీ డాడీ… మీ ఆశలు నెరవేర్చలేక పోతున్నా… అందుకే చనిపోతున్నా… అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది ఇంటర్ విద్యార్దిని..పరీక్షలు సరిగా రాయలేదన్న కారణంతో మనస్థాపానికి గురై తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో  బలవన్మరణానికి పాల్పడింది.సెల్ఫీ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని మనోవేధనకు గురిచేస్తుంది.

వరంగల్ చార్‌బౌళికి చెందిన సతీష్, స్వరూపల గారలపట్టి చందన.వయసు పదిహేడేళ్లు. మొదటి సంతానం అమ్మాయి కావడంతో సతీష్ దంపతులు ఆమెను ఎంతో గారభంగా పెంచారు. వరంగల్ లోని ఎస్‌ఆర్ ఇంటర్ మీడియట్ కళాశాలలో ఎంపీసీ రెండవ సంవత్సరం చదువుతోంది. పరీక్షలు ముగియడంతో తల్లిదండ్రులు చందనతో పరీక్షలు ఇలా రాసావు అని అడగడంతో బాగానే రాసా అని చెప్పింది ..కాని తల్లిదండ్రులు ఒక ఫంక్షన్ కి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న చందన  ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ” సారీ మమ్మి… సారీ డాడి… మీ ఆశ లు నెరవెర్చలేక పోతున్నా… అందుకేచనిపోతున్నా.. మమ్మి ఐ మిస్‌ యు.. డాడీ ఐ మీస్‌ యు.. వర్ష ఐ మీస్‌ యు అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి లోపలి నుంచి గడియపెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ఇంటికి తిరిగొచ్చే సరికి విగతజీవిగా పడిఉన్న కూతుర్ని చూసి జీర్ణించుకొలేక పోతున్నారు. పదో తరగతిలో 97 శాతంతో ఉత్తీర్ణత సాధించిన చందన ఇలా ఎందుకు చేసిందో తెలియడం లేదని బోరున విలపిస్తున్నారు తల్లిదండ్రులు.

watch video here:

విద్యా సంస్థలు విద్యార్దులనుండి ఫీజులు రాబట్టడంలో చూపుతున్న శ్రద్ద.తల్లిదండ్రులు మార్కులు,ర్యాంకుల కోసం పిల్లల వెంట పడడం ,పెరుగుతున్న పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేకపోవడం విద్యార్దుల ఆత్మహత్యకు ఇలా అనేక కారణాలు ..నిండు నూరేళ్లు బతకాల్సిన ఎందరో విద్యార్దులు ఇటీవల కాలంలో చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అనేకం. పరీక్షలు సరిగ్గా రాయలేదన్న భయంతో చందన అర్దాంతరంగా చనిపోయి, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.

Comments

comments

Share this post

scroll to top