పెళ్లి కాకుండానే మెడలో పసుపు తాళి, మంచంపై పూలు, పండ్లు… చివరికి ఉరితాడుకు వేళాడుతూ వధువు!! ఏం జరిగిందో తెలుసా ..!

కొన్ని రోజుల్లో కూతురు పెళ్లి అని సంతోషంగా ఉన్నారా తల్లిదండ్రులు. కూతురు పెళ్లి నిశ్చయమైందని సంతోషంతో  ఆ దేవుని దర్శణం కోసం వెళ్లారు.వాళ్లటు వెళ్లారో లేదో.. పిడుగు లాంటి వార్త. పెళ్లి కావాల్సిన తమ బిడ్డ.. ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి నగర్ లో ఈ విషాదం చోటు చేసుకుంది…

నిజమాబాద్ మహాలక్ష్మినగర్లో నివసించే గంగాధర్ గౌడ్ ఆర్టిసి ఉద్యోగి..గంగాధర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.పెద్దమ్మాయి  పేరు ప్రజ్ణ,వయసు 28. ఇటీవలే కూతురికి ఓ పెళ్లి సంబంధం ఖాయం చేశారు. వచ్చే నెల 6న ముహూర్తం కూడా నిర్ణయించారు. పెళ్లికి ముందు స్వామి దర్శనం చేసుకుని రావాలనే ఉద్దేశంతో గంగాధర్ భార్యను,చిన్న కూతురిని తీసుకుని తిరుపతి వెళ్లాడు.ప్రజ్ణను ఒక్కదాన్నే ఇంట్లో వదిలేసి కుటుంబం మొత్తం వెళ్లారు..వాళ్లు వెళ్లిన తర్వాత రోజు మధ్యాహ్నాం వరకు ఇంటి తలుపులు మూసే ఉండటంతో పక్కింటివారికి అనుమానం వచ్చింది. దీంతో కిటికీ తలుపులు తెరిచి చూడగా.. లోపల ప్రజ్ఞ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని కనిపించింది.దాంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. వారు హుటాహుటిన వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంగాధర్ దంపతులు తిరుపతి చేరుకున్నారో.. లేదో.. కుమార్తె చనిపోయిందంటూ పిడుగు లాంటి వార్త వారికి చేరవేశారు.

ప్రజ్ఞ ఉరేసుకున్న గదిలో.. మంచంపై పూలు, పండ్లు కనిపించాయి. పక్కనే ఓ కేకు కూడా కట్ చేసి ఉంది. అంతేకాదు, ఆమె మెడలో పసుపుతాడు, అక్కడే కొన్ని మాత్రలు కూడా కనిపించడం గమనార్హం. దీంతో ప్రజ్ఞ ఆత్మహత్య చేసుకుందా?.. లేక ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కచ్చితంగా ఆ గదిలోకి ఇంకెవరో వచ్చి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయి. యువతికి ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు…పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటుందనుకున్న కూతురు శవంగా పడిఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు..

 

Comments

comments

Share this post

scroll to top