ఈ 5 చిత్రాల్లో ఫస్ట్ మీకు ఏది కనిపిస్తుంది అనే దాన్ని బట్టి…మీ ఇన్నర్ మైండ్ ఏం ఆలోచిస్తుందో చెప్పొచ్చు.!

నిత్య జీవితంలో మ‌నం అనేక ఫొటోల‌ను చూస్తూ ఉంటాం. అవి మ‌న వ్య‌క్తిగ‌త‌మైన‌వి కావ‌చ్చు, లేదంటే ఇత‌రులవి కావ‌చ్చు, ప్ర‌కృతికి సంబంధించిన‌వి లేదంటే జంతువులు, ప‌క్షులు, పువ్వులు… ఇలా ర‌క ర‌కాల అంశాల‌కు చెందిన ఫొటోల‌ను మ‌నం చూస్తున్నాం. నేటి త‌రుణంలో స్మార్ట్‌ఫోన్ల‌లో అయితే అనేక యాప్‌ల‌లో, సైట్ల‌లో చెప్పాలంటే అనేక ఫొటోల‌ను మనం రోజూ చూస్తూ ఉంటాం. అయితే ఏ ఫొటో చూసినా, ఎక్క‌డ, ఎందులో చూసినా అవి మ‌న‌కు అనేక జ్ఞాప‌కాల‌ను గుర్తుకు తెస్తాయి. ఇంకొన్ని ఫొటోలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ ఇప్పుడు మేం కింద ఇచ్చిన ఫొటోల‌ను మీరు చూస్తే మాత్రం మీకు వాటిల్లో రెండు ర‌కాల అంశాలు, తేడాలు తెలుస్తాయి. ఈ క్ర‌మంలో మీరు మొద‌ట గుర్తించే అంశాన్ని బ‌ట్టి మీరు ఎలాంటి వారో కింద తెలుసుకోండి..!

పైన ఇచ్చిన ఫొటోలో మీకు ఏమి క‌నిపిస్తున్నాయి ? మ‌నిషి ముఖం, చేప‌లు ఉన్నాయి. మీకు మొద‌ట ఈ రెండింటిలో ఏది క‌నిపించింది ? ముందుగా మ‌నిషి ముఖం క‌నిపిస్తే మీరు సామాజిక వేత్త అయి ఉంటారు. ఇత‌రుల‌తో బాగా మాట్లాడుతారు. ఇత‌రుల జీవ‌నం ప‌ట్ల మీకు ఆస‌క్తి ఉంటుంది. మీరు ప్ర‌తిభావంతులు అయి ఉంటారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా ప‌రిష్క‌రించుకుంటారు. అదే మీరు పై చిత్రంలో ముందుగా చేప‌ల‌ను చూసి ఉంటే మీరు జీవితంలో చాలా సంతోషంగా ఉన్న‌ట్టు లెక్క‌. అదృష్టం మీ వెన్నంటి ఉంటుంది. మీరు అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌క‌పోయినా సంఘ‌ట‌న‌కు తగిన‌ట్టుగా మీరు ప్ర‌వర్తిస్తారు.

పైన ఇచ్చిన చిత్రంలో మీకు ముందుగా కీ హోల్ క‌నిపిస్తే మీరు మీ జీవితం ప‌ట్ల ఆస‌క్తిగా ఉంటారు. కొత్త కొత్త వారిని క‌ల‌వ‌బోతున్నాం అనే ఉత్సుక‌త మీలో ఉంటుంది. అదే పై చిత్రంలో మీకు ముందుగా ఏడుస్తున్న మ‌నిషి కనిపిస్తే మీ మాన‌సిక స్థితిని మీరు స‌రిగ్గా తెలుసుకోలేక‌పోతున్నారు అని అర్థం. మీరు మీ ఎమోషన్స్ ప‌ట్ల ఇంకొంచెం కేర్ తీసుకోవాలి అని తెలుసుకోవాలి.

పైన చిత్రంలో ఓపెన్ చేసిన డోర్ క‌నిపిస్తే మీరు జీవితంలో మార్పుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్టు తెలుసుకోవాలి. మీరు జీవిత ప్ర‌యాణంలో స‌రిగ్గానే ముందుకు సాగుతున్నారు అని అర్థం వ‌స్తుంది. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే దాని కోసం ఎదురు చూస్తున్న‌ట్టు తెలుసుకోవాలి. పైన చిత్రంలో మీకు ముందుగా మ్యూజిక‌ల్ నోట్ సింబ‌ల్ క‌నిపిస్తే మీరు మీ క్రియేటివిటీని ప్ర‌ద‌ర్శించేందుకు త‌గిన స‌మ‌యం వ‌చ్చింద‌ని తెలుసుకోవాలి. ప్ర‌పంచానికి ఏదో ఒక‌టి చేసి చూపించ‌బోతున్నార‌ని అర్థం చేసుకోవాలి. బాగా క‌ష్ట‌ప‌డితే అది మీరు సాధిస్తారు కూడా.

పైన ఇచ్చిన ఫొటోలో ముందుగా మీరు నిలువైన కాల‌మ్స్ చూస్తే మీరు కంఫ‌ర్ట్‌గా జీవించ‌డం లేద‌ని తెలుసుకోవాలి. అందుకోసం మీరు ప్ర‌పంచాన్ని అర్థం చేసుకోవాలి. మీరు రొమాంటిక్ వ్య‌క్తి అయి ఉంటార‌ని తెలుసుకోవాలి. పై ఫొటోలో ముందుగా మీరు మ‌నుషుల‌ను చూస్తే మీకు జీవితంలో నిర్దిష్ట లక్ష్యాలు ఏమీ లేవ‌ని తెలుసుకోవాలి. మీరు ఏదైనా సుల‌భంగా సాధిస్తారు. ఇత‌రుల ప‌ట్ల జాలి, ద‌య క‌లిగి ఉంటారు.

పై ఫొటోలో ముందుగా మీరు పురుషుడిని చూస్తే మీరు మీ జీవిత భాగ‌స్వామి కోసం ఎదురు చూస్తున్న‌ట్టు అర్థం. అదే వివాహం అయి ఉంటే మంచి రొమాంటిక్ లైఫ్‌ను కోరుకుంటున్న‌ట్టు తెలుసుకోవాలి. ఇక పై ఫొటోలో స్త్రీ కనిపిస్తే మీరు చాలా పాజిటివ్ యాటిట్యూడ్ క‌లిగి ఉంటార‌ని అర్థం. మీరు అనుభ‌వించే విష‌యాల‌ను మీ లైఫ్ పార్ట్‌న‌ర్ కూడా అనుభ‌వించాల‌ని చూస్తారు.

Comments

comments

Share this post

scroll to top