చిరంజీవిని కంటతడి పెట్టించిన వీడియో.!

మెగాస్టార్ చిరంజీవినే కంటతడి పెట్టించింది ఓ వీడియో. ఆ వీడియో చూస్తూ  తన గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి చిరు  కళ్లు చెమర్చాయ్. ఈటివి కార్యక్రమానికి అతిథిగా వచ్చిన చిరంజీవికి ఈ టివి వారు గతంలో రూపొందించిన వీడియోను చూపించారు.. ఆ  వీడియోను  చూస్తూ చూస్తూ  చిరు కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయ్.. ఆనంద భాష్పాలు అంటారే అచ్చం అలాంటివే ఇవి అన్నమాట.

ఇరవై యేళ్ల క్రితం తాను హీరోగా బిజీబిజీగా గడుపుతున్న సమయం అది.షూటింగ్ లో తీరిక దొరకగానే ఇంటికి వచ్చి తన పిల్లలతో సరదాగా గడిపేవాడు చిరంజీవి.  అలాంటిదే ఈ వీడియో..ఈ వీడియో లో చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ , సాయ్ ధరమ్ తేజ్ లు ఒక్కొక్కరుగా తమ ఢాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే  చూసి  మురిసిపోయాడు  చిరంజీవి …తన చిన్న కూతురు శ్రీజ అలిగినప్పుడు ఒడిలో కూర్చోబెట్టుకొని బుజ్జగించాడు. అందరితో కలిసి స్వీట్ లాగించేశాడు.

పిల్లలందరితో కలిసి చిరు చాలా హ్యాపీగా గడిపాడు. అప్పటి జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకొని చిరంజీవి  ఉద్వేగానికి లోనయ్యారు.

Watch Video Here:( Wait 4 Seconds For Buffering)

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top