“మెగా ఫామిలీ” నుండి మరో హీరో..! ఎవరో తెలుసా..? చిరంజీవికి ఏమవుతాడంటే..!

మెగా ఫామిలీ హీరోల గురించి కొత్త ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరంలేదు అనుకుంట. చిరంజీవి గారు వేసిన బాటలో ఎంతోమంది వచ్చారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్..ఇలా ఎంతో మంది వచ్చి తమ సత్తా చాటారు. నాగ బాబు కూతురు నిహారిక కూడా తెరంగేట్రం చేసింది. ఇప్పుడు మరొకరు ఎంట్రీ ఇవ్వనున్నారు.

చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ బాబు రాకకు రంగం సిద్ధం అవుతోందా అని అనిపించే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ ఫోటో తాజా న్యూస్ కు కారణం. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకున్నతరువాత ఈ మెగా కుటుంబ అల్లుడు త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఫోటోషూట్ లు కూడా జరిగాయంటే.

మొన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు తన ఇద్దరి మామయ్యల మధ్య నుంచుని ఉన్న ఫోటోను షేర్ చేసిన కళ్యాణ్ కు సంబంధించి మరో ఫోటో మాత్రమే కాకుండా ఒక మాస్ హీరో స్థాయిలో లుక్ తో కెమెరాలకు పోజులు ఇస్తూ తీయించుకున్న ఈఫోటో వెనుక చాల ఎత్తుగడలే ఉన్నాయి అని అనిపిస్తోంది. ఇంతకీ ఈఫోటోలో కనిపిస్తున్న కళ్యాణ్ లుక్ కు గురించిన వాస్తవాల గురించి క్లారిటీ లేకపోయినా క్రికెట్ టీమ్ ను తలపిస్తున్న మెగా కుటుంబ హీరోల లిస్టులో ఏదో ఒకరోజు ఈ జూనియర్ కళ్యాణ్ చేరడం ఖాయం అని అనిపిస్తోంది. మొత్తానికి మరో కళ్యాణ్ బాబు మెగా క్యాంప్ హీరోల్లో చేరబోతున్నాడన్నమాట.

 

Comments

comments

Share this post

scroll to top