“చిరంజీవి” అభిమానులకు చేదు వార్త..! “మీలో ఎవరు కోటీశ్వరుడు” షోను వదిలేస్తున్న “మెగా స్టార్”..ఎందుకో తెలుసా?

చూస్తూనే ఉండండి!…చిటీకెలో వచ్చేస్తా!…”..ఈ డైలాగ్ వినగానే మీకు “నాగార్జున గారు గుర్తోచేస్తారు!…మూవీస్ తో వచ్చిన క్రేస్ కంటే “మీలో ఎవరు కోటీశ్వరుడు” తో నే నాగార్జునకి క్రేస్ ఎక్కువ వచ్చింది!…నాగార్జున హోస్ట్ చేయడం వల్లే ఈ షో చాలా మంది చూశారు అనడం లో అతిశయోక్తి ఏం లేదు!..3 సీసన్స్ తో ఆడియెన్స్ ని ఎంటర్‌టేన్ చేశారు నాగార్జున గారు…కానీ సడన్ గా 4త్ సీసన్ కి నాగార్జున దూరం అయ్యారు…చిరంజీవి గారు హోస్ట్ చేస్తున్నారు..!

“చిరు విరామం” అని ప్రస్తుత సీజన్లో “చిరంజీవి” గారు “మీలో ఎవరు కోటీశ్వరుడు” షోని హోస్ట్ చేస్తూ ఎంతో మందికి పర్సనల్ అకౌంట్ నుండి కూడా సాయం చేస్తున్నారు. ఈ నెలాఖరుకి ఈ సీజన్లో ముగించనుంది. చిరంజీవి వచ్చాక చూసే వారి సంఖ్య తగ్గుతోంది. దీంతో చిరు త్వ‌ర‌లోనే త‌ప్పుకోనున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాదు చిరంజీవి గారు 151 వ సినిమాకూడా ఆయన షోకు దూరమవ్వడానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. చిరంజీవి గారి 151 వ చిత్రం “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” అని ఎంతో ప్రచారం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఈ పాటికే మొదలవ్వాలి. కానీ చిరంజీవి గారు “మీలో ఎవరు కోటీశ్వరుడు” షోలో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. ఆగష్టు లో చిత్రం షూటింగ్ ఎట్టి పరిస్తితుతలో మొదలవుతుంది అని చిత్ర నిర్మాత “రామ్ చరణ్” అన్నారు.

ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కట్టి సాము లాంటి కొన్ని విద్యల మీద పట్టు బిగించాలి అనుకుంటున్నారు “చిరు”. అందుకని నెక్స్ట్ సీజన్లో “మీలో ఎవరు కోటీశ్వరుడు” షో కి హోస్ట్ గా చేయరని ఇండస్ట్రీలో టాక్. “నాగార్జున” గారినే మళ్ళీ హోస్ట్ చేయమని “మా టీవీ” వారు అడిగారని తాజా సమాచారం. ఆడియన్స్ కూడా “నాగార్జున” మళ్ళీ వస్తే బాగుండు అనుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా…”మీలో ఎవరు కోటీశ్వరుడు” షోను హోస్ట్ చేయమని “జూనియర్ ఎన్టీఆర్ ” ను మా టీవీ బృందం సంప్రదించింది తాజా సమాచారం. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రచారం జరగలేదు!


మీరేమంటారు…? చిరంజీవి గారే నెక్స్ట్ సీజన్లో కూడా ఉండాలా..? లేక నాగార్జున గారు వస్తే బాగుండు అనుకుంటున్నారా..? కామెంట్ చేయండి!

 

Comments

comments

Share this post

scroll to top