చిరంజీవి పుట్టినరోజని…కోడలు “ఉపాసన” ఏమని ప్రామిస్ చేసిందో తెలుసా..? ఆ “ప్రామిస్” నిలుపుకోడానికి!

ఆగ‌స్టు 22న చిరంజీవి పుట్టినరోజు.. ఇది టాలీవుడ్ లోని మెగా అభిమానులకు పండుగ రోజు. ఇప్పటికే తన 150వ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి తనలో జోష్ ఏమాత్రం తగ్గలేదని సందేశాన్ని ఇచ్చారు. అయితే మెగాస్టార్ బర్త్ డేను పురస్కరించుకుని ఆయన కోడలు ఉపాసన కామినేని ఆయనకు ఓ ప్రామిస్‌ చేశారు. చిరంజీవి త‌న‌కు ఇచ్చిన అతిపెద్ద బ‌హుమ‌తి రామ్ చ‌ర‌ణ్ అని, అత‌నితో పాటు కుటుంబాన్నంత‌టినీ ఎల్ల‌వేళ‌లా సంతోషంగా ఉంచ‌డానికి తన తుది శ్వాస వరకు ప్ర‌య‌త్నిస్తానని మామ‌య్య‌కు ప్రామిస్ చేసిన‌ట్లు ఉపాస‌న తెలిపారు. ఈ ప్రామిస్‌ను నిలుపుకోవ‌డం ఒక అంద‌మైన బాధ్య‌త అని ఆమె అన్నారు. ఇంకా చిరు గురించి ఉపాసన ఏం చెప్పారంటే..

chiru in video

చిరంజీవికి తానంటే ఎంతో న‌మ్మ‌క‌మ‌ని, తాను చేసిన ప్ర‌తి ప‌నిని ఆయ‌న పొగడుతార‌ని, ఇంకా బాగా చేయాల‌ని ప్రోత్స‌హిస్తారని ఉపాస‌న చెప్పుకొచ్చారు. అలాగే రామ్ చ‌ర‌ణ్‌కి కూడా నాన్నంటే ఎంతో ప్రేమ అని, చిరంజీవి మాస్ట‌ర్ అయితే చ‌ర‌ణ్ స్టార్ శిష్యుడ‌ని ఆమె పేర్కొన్నారు. చిరంజీవి 150వ సినిమా త‌మ కుటుంబ స‌భ్యులంద‌రికీ ఎమోష‌న‌ల్‌గా బాగా క‌నెక్ట‌యిన చిత్ర‌మ‌ని ఉపాసన చెప్పారు. ఇక చిరుకి చేసిన ప్రామిస్‌ గురించి స్పందిస్తూ.. దానిని నిలుపుకోవ‌డం ఒక అంద‌మైన బాధ్య‌త అని, చిరంజీవిగారికి తానంటే ఎంతో న‌మ్మ‌క‌మ‌ని, తాను చేసిన ప్ర‌తి ప‌నిని ఆయ‌న పొగడుతార‌ని, ఇంకా బాగా చేయాల‌ని ప్రోత్స‌హిస్తారని ఉపాస‌న చెప్పుకొచ్చారు. చెర్రీకి వాళ్ల నాన్నంటే ఎంతో ఇష్టమని, వాళ్లు తండ్రీ కొడుకుల్లా కాకుండా గురు శిష్యుల్లా ఉంటారని ఉపాసన పేర్కొనడం గమనార్హం. తనను ఇంట్లో ఎంతో గొప్పగా చూసుకుంటారని వెల్లడించారు. ఇలాంటి ఇంట్లోకి రావడం తన అదృష్టమని ఉపాసన తెలిపారు. ఇదిలా ఉండగా..

వీరి వివాహం సమమంలో ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అందుకు కారణం ఉపాసన అప్పట్లో కాస్త లావుగా ఉండటమే. తర్వాత కొన్నాళ్లకు ఉపాసన, రామ్ చరణ్ విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తర్వాత రామ్ చరణ్ స్వయంగా వివరణ ఇచ్చారు. అలాంటిదేమీ లేవని ఆ వార్తలు కొట్టిపారేశారు. ఇక అప్పుడెప్పుడో ఓ ఇంటర్వ్యూలో.. మీరు చెర్రీకి సరైన జోడీ కాదనే విమర్శపై ఉపాసన స్పందిస్తూ.. ‘నిజమే అప్పుడు నేను లావుగా ఉండేదాన్ని. నేను చరణ్ కి సరిజోడికాదు అంటే సంతోష పడే విషయమే.. మా ఆయనకు చాలా మంది గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. వారంతా తనకు ది బెస్ట్ కావాలని కోరుకుంటున్నారనేగా, ఇది బాగుంది… దీన్ని ఒక పొగడ్తగానే తీసుకుంటా’ అంటూ ఉపాసన చాలా పాజిటివ్ గా.. ఇంకా చెప్పాలంటే పరిణితితో స్పందించి శభాష్ అనిపించుకున్నారు. ఆమె ఆ విమర్శలకు కుంగిపోలేదు సరికదా.. స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టి చాలా స్లిమ్ అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి మెగా ఫ్యామిలీలో ఉపాసన ఓ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారురు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెల్ ఎస్టాబ్లిస్డ్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా కుటుంబంలో అద్భుతంగా ఒదిగిపోవడమే కాదు.. తాను డబ్బున్న ఇంటి నుంచి వచ్చానన్న దర్పాన్ని ఏనాడూ చూపకపోవడం ఆమె క్యారెక్టర్ కు పబ్లిక్ లో ఎక్కడలేని క్రేజీ వచ్చింది. అందుకే అంటారు అందం కాదు ఆత్మ సౌందర్యం ముఖ్యమని.. ఉపాసనను చూస్తే అది నిజమేనని అర్థం కావడంలేదూ!

Comments

comments

Share this post

scroll to top