సురేఖ వెక్కి వెక్కి ఏడ్చింది.. భావోద్వేగానికి గురయ్యా..! “చిరంజీవి” సంచలన వ్యాఖ్యలు.!

మా ఇంజిన్ కి కులం ,గోత్రాలుండవ్ ఏ చేనైనా తడిపేద్దంతే అంటూ రాంచరణ్  … గిల్లేత్తున్నావేంటి ..గాజులు కొనిపెట్టమంటే అంటూ సమంతా అమాయకంగా వయ్యారాలు పోతూ…థియేట్రికల్ ట్రైలర్ తో ప్రేక్షకుల మందుకొచ్చారు.ఒక గ్రామం ఎలక్షన్ల నేపథ్యంలో కథ ఉ:టుందని రణస్థలం అంటూ ట్రైలర్లో చెప్పకనే చెప్పారు.విశాఖపట్నంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు..ఈ సంధర్బంగా చిరంజీవి మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి..

సుకుమారే కర్త ,కర్మ ,క్రియ

విశాఖపట్నానికి ఎప్పుడు వచ్చిన ఎప్పుడూ ఓ ఆనంద, ఉత్సాహం ఉంటుంది. సముద్రంతో పోటీ పడుతూ వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ…. రంగస్థలం సినిమాకు సంబంధించిన అగ్రతాంబూలం దర్శకుడు సుకుమార్‌కే దక్కుతుంది. చాలా స్వచ్చమైన వాతావరణం ప్రతిబింబించే సినిమా. పల్లెటూరు మనస్తత్వాన్ని చాటిచెప్పే, ఉద్వేగాన్ని రేకేత్తిస్తుంది.ఈ సినిమాకు కర్త,కర్మ ,క్రియ సుకుమారే అంటూ చెప్పుకొచ్చారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని ,రత్నవేలు సినిమాటోగ్రఫీని గురించి మాట్లాడిన చిరంజీవి.. నాకు ఖైదీ క్రేజ్‌ను తెచ్చిపెట్టిందో.. అలా రంగస్థలం రాంచరణ్‌కు అంత క్రేజ్ తెచ్చిపెడుతుంది. రంగస్థలం సినిమా రాంచరణ్‌కు రావడం కొంత ఈర్షగా ఉంది. తండ్రిగా నాకు గర్వంగా ఉంది.

వెక్కి వెక్కి ఏడ్చిన సురేఖ

రంగస్థలం సినిమా చూసిన తర్వాత నేను, సురేఖ భావోద్వేగానికి గురయ్యాం.క్లైమాక్స్ ఏదైతే ఉందో అది చూసాకా సురేక ఏడ్చేసింది. ఎంతైనా తల్లిమనసు కదా బయటపడిపోయింది.చరణ్ ని పట్టుకుని  వెక్కి వెక్కి ఏడ్చింది. రాంచరణ్ నటన చూసి గర్వపడింది. సినిమా చూసిన తర్వాత సుకుమార్‌తో దాదాపు అర్ధగంట సేపు మాట్లాడాను.నిజంగా ఈ సినిమాలో ఎవరి పాత్రల మేరకు వారు చాలా బాగా నటించారు.ఈ క్రెడిట్ అంతా సుకుమార్ కే దక్కుతుంది..అన్ని కేటగిరీలో అవార్డులు సొంతం చేసుకుంటుంది అన్నారు.అయితే ఈ సినిమాలో ఆది చనిపోతాడనే సస్పెన్స్ ని చిరంజీవి రివీల్ చేసేశారు.

Comments

comments

Share this post

scroll to top