ప్రభాస్ – నీహారిక పెళ్లి వార్తలపై స్పందించిన “చిరంజీవి”.! ఏమన్నారో తెలుసా.?

ప్రభాస్ – నిహారికల పెళ్లి అంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు మెగాస్టార్ చిరంజీవి.అసలు అలాంటి ఆలోచనే మేం చేయలేదని ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు రాయడం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభాస్ వయస్సు 38. నీహారిక వయస్సు 24. ప్రస్తుతం వీళ్లద్దరి సినిమాల్లో బిజీగా ఉన్నారు…వారి పెళ్లి అని వస్తున్న వార్తలు వట్టి పుకార్లు ఎవరూ నమ్మొద్దంటూ,నిరాధారమైన వార్తలు ప్రచురించొద్దంటూ మీడియాపై సీరియస్ అయ్యారు.

బాహుబలి ప్రభాస్ – కొణిదెల నీహారిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.. రెండు కుటుంబాలు ఇప్పటికే మాట్లాడుకున్నాయి.ఈ పెళ్లి పెద్దగా  చిరంజీవే వ్యవహరిస్తూ ..ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుతో మాట్లాడారు.. నాగబాబు ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది.. ఇలాంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.కేవలం టాలీవుడ్ గాసిప్స్ లోనే కాదు.. హిందీ, ఇంగ్లీష్ తోపాటు ఇతర భాష వెబ్ సైట్లలో ఈ వార్త వైరల్ అయ్యింది. ఎన్డీటీవీ, ఇండియా టుడే లాంటి జాతీయ పోర్టల్స్ లోనూ ప్రముఖంగా రావడంతో ప్రభాస్ – నీహారిక పెళ్లి నిజమేనా అంటూ సినీ ఇండస్ట్రీ గుసగుసలాడుకుంటోంది. ఈ క్రమంలోనే.. కొణిదెల ఫ్యామిలీ ఈ వార్తపై స్పందించింది. ఇది తప్పుడు వార్త అని.. ఇలాంటి వార్తలు రాసే ముందు ఓసారి వివరణ కోరాల్సిన బాధ్యత మీడియాపై ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ కూడా మమ్మల్ని సంప్రదించకుండానే రాసేస్తున్నారు. కనీసం అవునా – కాదా అని కూడా అడగటం లేదు.. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసేస్తున్నారు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కూడా నిహారికా ,సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ వార్తలొచ్చాయి,వరసకు బావ మరదళ్లు కదా , నిజమేనేమో అనుకున్నారు.అప్పుడు కూడా ఇదేవిధంగా మెగా ఫ్యామిలి ఆ వార్తలు తప్పంటూ ఖండించింది.మరోవైపు సాయిధరమ్ తేజ్,రెజీనా.. నాగశౌర్య,నిహారికా ప్రేమలో ఉన్నాయని వార్తలొచ్చాయి.రెజీనా,సాయి ధరమ్ తేజ్ పై వచ్చిన కామెంట్స్ కి వారు రెస్పాండ్ కాలేదు..తర్వాత నిహారికా,నాగ శౌర్యలు ప్రేమలో ఉన్నారు..వారి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు .అందుకే చిరంజీవి ఛలో ఆడియో ఫంక్షన్ కి వెళ్లాడంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు రాసేశారు..వీటిని అటు నాగశౌర్య,ఇటు మెగా ఫ్యామిలి కొట్టిపారేశారు..ఇప్పుడు నిహారికా,ప్రభాస్ పెళ్లంటూ వస్తున్న వార్తలపై చిరంజీవి ఘాటుగానే స్పందించారు.

Comments

comments

Share this post

scroll to top