చిప్స్ పాకెట్ లో గాలెందుకు నింపుతారు…చూడడానికి సిల్లీనే, కానీ రీజన్ తెలిస్తే అవాక్కవుతారు!

కొన్ని విషయాలు చూడడానికి వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తాయ్, కానీ దాని వెనుక రీజన్స్ తెలుసుకుంటే మాత్రం అవునా…? అని మనకే ఆశ్చర్యమేస్తుంది. అలాంటివే కింద ఓ 10 చిన్న చిన్న డౌట్స్, వాటిని పర్ఫెక్ట్ రీజన్స్ ఉన్నాయి,. ఓ లుక్కేయండి…. సమకూర్చడానికి చాలా కష్టపడ్డాం.. చదివి ఆనందించి, అభినందిస్తారని కోరుకుంటున్నాం.
1. చిప్స్ పాకెట్ లో గాలిని ఎందుకు ఎక్కువగా నింపుతారు:
ఈ మధ్య కాలంలో మనకందరికీ ఎదురయ్యే ప్రశ్న, చాలా చికాకుగా అనిపించిన ప్రశ్న. చూడటానికేమో పాకెట్ పెద్ద సైజ్ లో ఉంటుంది. తీరా చూస్తే పాకెట్ మొత్తం గాలితో నింపబడి ఉంటుంది. చిప్స్ మాత్రం కొన్నే ఉన్నాయని ఫీల్ అవుతాం. నిజానికి అందులో నైట్రోజన్ వాయువును నింపుతారట. ఎందుకిలా చేస్తారంటే ఎక్కడి నుండో మరోచోటుకు ఇలా ట్రాన్స్ పోర్ట్ చేస్తుంటారు, ఒకోసారి ఎక్కువ రోజులు నిల్వఉంచడం వలన చిప్స్ పాడైపోయి, ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంటాయి. ఇలా జరగకుండా ఉండేందుకు భద్రతగా ఉండాలనే ఈ నైట్రోజన్ ను నింపుతారట.
COMMON-ANSWERS-10
2.హెడ్ ఫోన్స్ మన జేబులో ప్రతిసారి చిక్కుముళ్ళుగా ఎందుకు ఉంటాయి:
బైక్ లో వెళ్తుంటాం, సాంగ్స్ విందామనుకుంటాం, జేబులో నుండి హెడ్ ఫోన్స్ తీస్తే అవేమో చిక్కుముళ్ళుగా ఉండి చాలా చికాకుగా కలిగిస్తాయి. ఎన్నో చిక్కుముడులు ఉండడంతో వాటిని యధాస్థితికి చేర్చాలంటే నానా తంటాలు పడుతుంటాం. సైంటిస్టులు జరిపిన పరిశోధనలో 50 శాతం వరకూ ఎక్కువ పొడవు ఉన్న హెడ్ ఫోన్సే ఇలా ఎక్కువగా చిక్కుముడులు పడతాయట. ఇక y షేప్ తో ఉన్నటువంటి హెడ్ ఫోన్స్ చాలా ఈజీగా చిక్కుముడులు పడ్డా తీసుకోవచ్చట.
2
3. మనం ఎన్నిసార్లు సెల్ఫీ తీసుకున్నా ఆ సెల్ఫీ మనకు ఇష్టం ఉండదు,కారణం:
మీరు మీ మొబైల్ లో ఎన్నోసార్లు సెల్ఫీ తీసుకుంటారు కానీ మీకు నచ్చక ఆ సెల్ఫీలను డిలీట్ చేస్తుంటారు. కారణం ఎక్స్ పోజర్ సమస్యవలనే. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మీ ఇంట్లోని అద్దం ముందుకు వెళ్లి, ఆ అద్దం ముందు నవ్వుతూ నిల్చొండి. మీకు ఇష్టమైన స్టైల్ లో అద్దంవైపు చూస్తూ సెల్ఫీ దిగండి. ఆ సెల్ఫీ ముందు ఇంకే కెమెరామెన్ పనికిరాడంతే.
3
4.వీకెండ్స్ లోనే ఎక్కువగా వర్షం పడుతుంది ఎందుకు:
దానికి బాధ్యులం మనమే. పెద్దగా తిట్టుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే సోమవారం నుండి శుక్ర,శనివారాల వరకు రయ్..రయ్ మంటూ వాహనాలతో దూసుకెల్తుంటాం. మోనాక్సైడ్,ఓజోన్, ఏరోసేల్ వంటి కాలుష్య వాయువులు రిలీజ్ అయి, ఆ అణువులు  సూర్యకాంతి ప్రతిబింబానికి దూరంగా ప్రతిబింబిస్తాయి. మరియు నీటిపరమాణువులు  ఆ ప్రతిబింబాల చివరన ఉంటాయి. అయితే వీకెండ్ నిర్మాష్యుమైన రోడ్లతో, ఎటువంటి కాలుష్యం ఉండదు కాబట్టి ఆ ఘనీభవించిన నీరు వర్షపు చినుకులుగా పలకరిస్తాయి.
6
5. దోమల్ని చంపినంతంగా సులభంగా ఈగల్ని చంపలేము ఎందుకని:
ఎందుకంటే మన ఇంటి వాతావరణంలో తిరిగే ఈగలన్నీ కూడా ఒకే చోట ఉండకుండా 360 డిగ్రీలు అలా తిరుగుతూనే ఉంటాయి. మనం వాటిని చంపడానికి ఎంత ప్రయత్నించినా సరే మ్యాగ్జిమం మనం అన్ని డిగ్రీల వరకు వెంటనే  తిరగగలం. అలా మనం తిరిగేలోపే అవి అక్కడి నుండి తప్పించుకొని వెళతాయి. ఇంకా మనం చూస్తున్న విషయాన్ని 100 మిల్లీ సెకన్లలోపే అవి గ్రహించి అక్కడినుండి సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి. అదే మనకు అలా చూడటానికి 300 మిల్లీ సెకన్ల టైం పడుతుంది. ఈ లోపు అవి తుర్రుమని తప్పించుకుంటాయి.
8
6. మన చొక్కాలను ఇస్త్రీ చేసినట్లుగా టీ షర్ట్ ను ఇస్త్రీ చేయలేం ఎందుకు:
పొడిగా మరియు ఫాబ్రిక్ గా ఉండడంతో పాటు సులభతరంగా మడవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇస్త్రీ చేయడానికి. అదే తడిదనం ఉన్నట్లయితే ఇస్త్రీని చాలా ఈజీగా పూర్తిచేయవచ్చు. ఆవిరి వాటికి బాగా తగలడం వలన సులభంగా ఐరన్ చేయవచ్చు. అయితే ఫ్యాబ్రిక్ అణువులు తొందరగా విభజించుకుంటాయి కాబట్టి ఇలా టీ షర్ట్ లను ఐరన్ చేయడం చాలా ఇరిటేట్ గా అనిపిస్తుంది.
COMMON-ANSWERS-6
7. ఎందుకు గ్రామర్ మనకు చిరాకు కలిగిస్తుంది:
ఎందుకంటే అక్కడ వ్యాకరణం సరిగా లేదని మన మెదడుకు తెలుసు కాబట్టి.మనకు బాగా గుర్తున్న మాటలు,పదాలు ఎప్పుడూ మన మెదడులో భద్రంగా ఉంటాయి. అందుకే చిన్న తప్పు కనబడినా ఆ సిగ్నల్స్ మన మెదడుకు చేరగానే వాటి సంకేతాలను నిలిపివేస్తాయి. అందుకే ఇలాంటి పదాలు తప్పుగా కనిపించగానే మన మెదడుకు చిరాకు కలుగుతుంది.
COMMON-ANSWERS-3

Comments

comments

Share this post

scroll to top