మిస్టరీ వీడింది: మొండెం లేకుండా చిన్నారి తల “నరబలి” కేసులో అసలు నిందితుడు ఎవరో తెలుసా.? భార్య అనారోగ్యం వల్లే పూజారి

మొండెం లేదు..తల మాత్రమే దొరికింది. ఆరేసిన బట్టలు తీయడానికి ఇంటి డాబాపైకి వెళ్లిన ఓ మహిళ సంచిలో చిన్నారి తలను చూసి షాక్ అయ్యింది. చుట్టుపక్కన వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. గత వారం హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరిగిన ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇంత నీచానికి ఎవరు ఒడిగట్టారు అని అందరు అనుకుంటూ ఉన్నారు. ఘటనా స్థలిలో పరిస్థితులను బట్టి ఇది నరబలి అయి ఉంటుందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. మరోవైపు వివాహేతర సంబంధంతో హత్య జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. చివరికి మిస్టరీని ఛేదించారు పోలీసులు.

క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ నిందితుడు:

ఇంటి యజమాని రాజశేఖర్ (క్యాబ్‌ డ్రైవర్‌) ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేల్చారు.. పాపను చంపింది తానేనని పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. కరీంనగర్ తండా నుంచి పాపను తీసుకొచ్చినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు .ఈ కేసులో పోలీసులు పూజారితో సహా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాడు. పాప కొనుగోలు విషయంలో మధ్యవర్తిత్వం వహించిన బ్రోకర్లను సైతం అరెస్టు చేశారు.

భార్య అనారోగ్యం వల్లే:

రాజశేఖర్ మూఢనమ్మకం వల్ల ఓ పసికందు ప్రాణాలు పోయాయి. వివరాల్లోకి వెళ్తే…ఉప్పల్ చిలుకానగర్ లో నివాసం ఉంటున్న రాజశేఖర్ క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య ఆరోగ్యం గత కొద్ది రోజులుగా బాగుండటం లేదని క్షుద్ర పూజాలు చేసే పూజారుల వద్దకు తిరిగాడు. పూజారులు చెప్పిన విధంగా చంద్రగ్రహణం రోజు క్షుద్రపూజలు ప్లాన్ చేశాడు. క్షుద్రపూజలో భాగంగానే అప్పటికే తాము కొనుగోలు చేసిన ముక్కుపచ్చలారని పసికందును బలి ఇచ్చాడు. తరువాత తెల్లవారుజామున మొండాన్ని మాయం చేసిన రాజశేఖర్, తలను ఇంటి దాబాపై ఉంచాడు. తలను మాయం చేయడానికి అవకాశం లేక పోవడంతో తన ఇంటిపై పాప తల ఉంచడని ఎవరికి అనుమానం రాకుండా తానే పోలీసులకు సమాచారం అందించాడు.

ఆరేసిన బట్టలు తీయడానికి వెళ్ళినప్పుడు:

అయితే రాత్రి ఆరవేసిన బట్టలు తీయడానికి రాజశేఖర్ అత్త బిల్డింగ్ పైకి వెళ్లారని. ఉదయం 11 గంటల సమయంలో వెళ్లిన వారికి సుమారు మూడునెలల వయస్సు కలిగిన చిన్నారి తల రక్తపు మడుగులో ఉందని రాజశేఖర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు.

జాయింట్ సిపి తరుణ్‌జోషి, డిసిపి ఉమామహేశ్వరశర్మ, ఎసిపి కృష్ణమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. వీరితోపాటు డాగ్‌స్కాడ్, క్లూస్‌టీం, ఎస్‌ఒటి విభాగాలు కేసులో భాగమై ఆధారాలు సేకరించారు. రాజశేఖర్ ఇచ్చిన సమాచారంతో అతడి ఇంటి దగ్గరలోని నరహరి ఇంట్లో క్షద్ర పూజలు జరిపినట్టు గుర్తించారు. గ్రహణ సమయంలో పూజలు చేసి పాపను బలిచ్చి పోలీసులను రాజశేఖర్ తప్పదారి పట్టించాడు. పోలీసులు మెకానిక్ నరహరి, అతని కొడుకు రంజిత్‌ను అరెస్టు చేసి, వీరిని విచారించిన పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. కేసు విషయంలో రాజశేఖర్ వ్యవహార తీరుపై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. దీంతో నిందితుడు తాను చేసిన ఘోరాన్ని చేసినట్టు ఒప్పుకున్నాడు.

Comments

comments

Share this post

scroll to top