7 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన టీవీ సీరియల్…ఏమైందో తెలుస్తే టీవీ సీరియల్ మీద కోపం రావడం పక్కా..!

నారదుడు తన బ్రాంచిలను భూమ్మీద సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తున్నాడు..టీవి సీరియళ్ల రూపంలో అని..ఇటీవల ఒక పోస్టు చదివా ఎఫ్బీలో…నిజమే కదా అనిపించింది..ఎప్పుడు చూసినా అందులో అత్తకోడల్ల గొడవలు,భార్య భర్తల తగాదాలు తప్ప ఏం ఉండవ్..వాటిని చూస్తూ జనం కూడా అలాగే తయారవుతున్నారు.తాజాగా టీవి సీరియల్ ఒక చిన్నారి ప్రాణం బలితీసుకుంది…

చైత్రా, మంజునాథల కుమార్తె ఏడేళ్లకూతురు  ప్రార్థన (7).కర్నాటక రాష్ట్రం దావణగెరె జిల్లా హరిహర పట్టణంలోని ఆశ్రయ కాలనీ.ప్రార్దన రెండో తరగతి చదువుతోంది. టీవిలో  ప్రతిరోజు వచ్చే ‘నందిని’ సీరియల్‌ను ఇష్టంగా చూసేది .  ప్రార్థనను పాఠశాల నుంచి తీసుకొచ్చిన నాయనమ్మ టీవీ ఆన్‌ చేసి బయటికి వెళ్లిపోయింది.రోజులానే సీరియల్ చూస్తున్న ప్రార్ధన.. ఆ రోజు ఎపిసోడ్లో  హీరోయిన్‌ తనకు తాను నిప్పంటించుకొనే సన్నివేశం రావడంతో తాను కూడా అలాగే చేయాలనుకుంది…ఆలోచన వచ్చిందే తడవుగా ఇంట్లో ఉన్న పేపర్లను చుట్టూ వేసుకుని నిప్పంటించి, వాటి మధ్య నిలబడి డ్యాన్స్‌ చేయడానికి ట్రై చేసింది..దాంతో ప్రార్దన శరీరానికి నిప్పంటుకుంది..సమయానికి రక్షించడానికి  ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంటల్లో కాలిపోతూ … బాధను తట్టుకోలేక పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారంతా వచ్చి, మంటలను ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. . కోలుకోలేనిస్థాయిలో శరీరం కాలిపోయి… 24 గంటలు గడవకముందే మరణించింది.

టీవీలు, సినిమాలు విజ్ఞానాన్ని పంచాలి. నవ్వించాలి. ఏకాంతాన్ని మరిపించాలి. చరిత్రను, సంస్కృతిని చాటిచెప్పాలి. కానీ.. అలా జరగడంలేదు. హింసను, పగను, ద్వేషాన్ని ప్రేరేపిస్తున్నాయి అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ.

Comments

comments

Share this post

scroll to top