స్కూల్ పరిసరాల్లోనే 7 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం… తండ్రే చేసి ఉంటాడ‌ని అనుమానం..?

నేటి త‌రుణంలో మ‌నం ప్ర‌తి రోజూ ప్ర‌తి పూట ఎక్క‌డో ఒక చోట మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న దాడులు, వారిపై జ‌రుగుతున్న అత్యాచారాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. నిజంగా ఇలాంటి వార్త‌ల‌ను మ‌నం ఎప్పుడు విన‌కుండా ఉంటామో తెలియ‌దు కానీ, రోజూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు మాత్రం జ‌రుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది ఇలాంటి ఘ‌ట‌న‌ల బారిన ప‌డుతున్నారు. తాజాగా ఓ 7 ఏళ్ల బాలిక కూడా మృగాళ్ల పైశాచిక‌త్వానికి బ‌లై పోయింది. ఆమెను దారుణంగా రేప్ చేశారు. అనంత‌రం చంపేశారు. ఈ ఘ‌ట‌న జ‌రిగింది ఆగ్రాలో.

ఆగ్రాలోని ఈత్మ‌ద్‌పూర్ అనే ప్రాంతంలో ఈ నెల 24వ తేదీన అర్థ‌రాత్రి స‌మ‌యంలో ఓ స్కూల్ ప్రాంగ‌ణంలో 7 ఏళ్ల బాలిక మృత‌దేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులు మృత‌దేహాన్ని చూసిన‌ప్పుడు ఆ బాలిక శవంపై ఎలాంటి దుస్తులు లేవు. ఆమె పొట్ట నుంచి బ్లీడింగ్ అయిన‌ట్టు పోలీసులు తెలిపారు. కాగా ఆ స్కూల్ ప‌క్క‌నే 300 మీట‌ర్ల దూరంలో ఉన్న గుడిసెలో ఆ బాలిక నివాసం ఉంటోంది. ఆమెకు త‌ల్లి లేదు. ఆమె పుట్టాక ఏడాదికి త‌ల్లి చ‌నిపోయింది. దీంతో తండ్రి ద‌గ్గ‌రే ఆ బాలిక పెరుగుతోంది. అయితే ఆ బాలిక‌కు ఓ అన్న ఉన్నాడు. అత‌ని వ‌య‌స్సు 9 ఏళ్లు. వీరిద్ద‌రూ త‌మ తండ్రి వ‌ద్దే ఉంటున్నారు.

అయితే 24వ తేదీన రాత్రి పూట ఆ బాలిక తండ్రి త‌న కూతురు క‌నిపించ‌డం లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు అన్ని చోట్లా వెతికారు. అలా వెతికే క్ర‌మంలో ఆ బాలిక చ‌దువుకునే స్కూల్ ప్రాంగ‌ణంలో అర్థ‌రాత్రి పూట ఆమె మృత‌దేహాన్ని పోలీసులు క‌నుగొన్నారు. ఈ క్ర‌మంలో ఆ బాలిక తండ్రే త‌న సొంత కూతురిపైనే ఇలాంటి దారుణానికి పాల్ప‌డి ఉంటాడ‌ని పోలీసులు చెప్పారు. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయ‌ని వారు తెలిపారు. ఏది ఏమైనా నిజంగా ఈ తండ్రి గ‌నుక నిందితుడు అయితే వాన్ని అస్స‌లు వద‌ల‌కూడ‌దు.

Comments

comments

Share this post

scroll to top