8 నెలల పసిపాపను రేప్ చేసాడు ఆ నీచుడు..! ఆ పాప జననావయవాల వద్ద తీవ్రమైన రక్తస్రావం, గాయాలు కావడంతో

ఛీ.. ఛీ.. నేటి సమాజంలో ఇలాంటి నీచులు కూడా నిజంగా ఉంటున్నారంటే… అందుకు మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఇలాంటి నీచుల గురించి చెప్పాల్సి రావడం నిజంగా సిగ్గు చేటు. అసలు ఇలాంటి వారు సమాజంలో ఎందుకు జీవిస్తున్నారో వారికే తెలియదు. కానీ నీచమైన ఘటనలకు మాత్రం పాల్పడుతుంటారు. ఇలాంటి వారిని మాత్రం అసలు ఊరికే విడిచి పెట్టరాదు. చాలా కఠినతరమైన శిక్షలు వేయాలి. ఎందుకంటే.. వారు చేసే నేరాలు అలాంటివి మరి. ఈపాటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది, మేం ఏం చెబుతున్నామో. అవును, ఓ నీచుడు చేసిన పని గురించే ఇప్పుడు చెప్పేది. 8 నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఆ కాముకుడు.

ఢిల్లీలో నివాసం ఉండే ఓ కుటుంబంలో 8 నెలల చిన్నారి ఉంది. ఆ పాప తల్లిదండ్రులు ఇద్దరూ రోజూ వారీ కార్మికులే. దీంతో పాపను ఇంట్లో వేరే బంధువు అయిన ఓ యువకుడి వద్ద వదిలి వెళ్లారు. ఈ క్రమంలో ఆ యువకుడికి ఒంటరిగా ఉన్న పాపను చూడగానే పాడు బుద్ధి పుట్టింది. దీంతో ఆమెపై అతను అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించాడు. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన తల్లిదండ్రులు తమ పాపను చూసి షాక్‌ అయ్యారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.

ఆ పాప జననావయవాల వద్ద తీవ్రమైన రక్తస్రావం, గాయాలు కావడంతో వైద్యులు ఆ పాపకు సర్జరీ చేశారు. అది 3 గంటల పాటు కొనసాగింది. అనంతరం ఆ పాపను ఐసీయూలో పెట్టారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సదరు పాపాత్మక యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏది ఏమైనా ఇలాంటి మృగాళ్లను మాత్రం అస్సలు విడిచి పెట్టకూడదు. కఠినంగా శిక్షించాలి.

Comments

comments

Share this post

scroll to top