ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న వీడియో ఇది. శ్రీ‌దేవి చిన్న‌ప్ప‌టి వీడియోన‌ట‌.!?

శ్రీ‌దేవి. వెండితెర‌పై మెరిసిన తెలుగు తార‌. తెలుగు మాత్ర‌మే కాదు, అనేక భాషా చిత్రాల్లో న‌టించి ఈమె మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రీ‌దేవి బాల‌న‌టిగానూ ప‌లు చిత్రాల్లో న‌టించింద‌ని మ‌నంద‌రికీ తెలుసు. అప్పుడు ఆమె ఎంతో ముద్దుగా ఉండేది. ఈ క్ర‌మంలోనే ఆమెకు చెందిన చిన్న‌ప్పటి వీడియోగా ఓ వీడియో ఇప్పుడు నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అందులో ఉన్న చిన్నారి అచ్చం చిన్న‌ప్ప‌టి శ్రీ‌దేవిని పోలి ఉండ‌డంతో అది ఆమె వీడియోనే అని చెబుతూ కొంద‌రు ఆ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడా వీడియో వైర‌ల్ అయింది. అయితే అస‌లు అది ఆమె వీడియోనేనా..? ఇందులో నిజం ఎంత‌..?

చూశారుగా… వీడియో చూస్తే మీకెమనిపిస్తుంది..? అచ్చం శ్రీ‌దేవి చిన్న‌ప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది క‌దా ఈ చిన్నారి కూడా. అస‌లు మొత్తం శ్రీ‌దేవిని కార్బ‌న్ కాపీ, జిరాక్స్ తీసిన‌ట్టు ఉంది ఆ చిన్నారి. అయితే నిజానికి ఈ వీడియో శ్రీ‌దేవి చిన్న‌ప్ప‌టి వీడియో కాదు. అవును, అంటే దీన్ని ఎలా క‌న్‌ఫాం చేయ‌వ‌చ్చు అంటే ఆ వీడియో చాలా క్లారిటీ ఉంది. పైగా క‌ల‌ర్ వీడియో. నిజానికి శ్రీ‌దేవి చిన్న‌ప్పుడు అంత‌టి క్లారిటీతో క‌ల‌ర్ వీడియోలు తీసే కెమెరాలు రాలేదు. క‌నుక ఈ వీడియో అస‌లు శ్రీ‌దేవిది కాద‌నే చెప్ప‌వ‌చ్చు.

అయితే చూసేందుకు మాత్రం అచ్చం ఆ చిన్నారి శ్రీ‌దేవిని పోలి ఉంది. దీంతో ఆ బేబీని చాలా మంది ఆశ్చ‌ర్యంగా చూస్తున్నారు. ఇప్ప‌టికీ ఈ వీడియోను కొన్ని ల‌క్ష‌ల మంది చూశారు. నిజానికి దీన్ని ఎవ‌రు అప్‌లోడ్ చేశార‌నేది మాత్రం తెలియ‌దు. కానీ వీడియో మాత్రం బాగా ట్రెండ్ అవుతోంది..!

Comments

comments

Share this post

scroll to top