చిన్నపుడు అందంగా లేదని అవమానించింది ఓ న్యూస్ ఛానల్..”దిశా” ఎలాంటి కౌంటర్ ఇచ్చిందో తెలుసా.?

సెల‌బ్రిటీలు అన్నాక‌.. వారు చేసే ప‌నులు అప్పుడ‌ప్పుడు నెటిజన్ల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తుంటాయి. దీంతో నెటిజ‌న్లు వారిని సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శిస్తుంటారు. ట్రోల్ చేస్తుంటారు. ఇది ఈ మ‌ధ్య కాలంలో మ‌రీ ఎక్కువ అయింద‌నే చెప్ప‌వచ్చు. స‌రే.. వారు చేసే ప‌నులు ఆగ్ర‌హం తెప్పిస్తాయి.. అందుకు వారిని విమ‌ర్శించ‌వ‌చ్చు. కానీ కొన్నిసార్లు సెల‌బ్రిటీలు ఏమీ చేయ‌క‌పోయినా.. వారికి చెందిన కొన్ని విష‌యాల‌ను హైలైట్ చేసి కొంద‌రు వారిని ట్రోల్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం న‌టి దిశా ప‌టానికి జ‌రిగింది కూడా ఇదే. ఇంత‌కీ అస‌లు ఏమైందంటే…

దిశాప‌టాని హీరోయిన్‌గా చేసిన సినిమాల క‌న్నా ఆమె చేసిన ఫోటో షూట్‌లే ఎక్కువ‌గా. అంత‌గా ఈమె త‌న ఫొటోషూట్‌ల‌తో పాపుల‌ర్ అయింది. ఎప్ప‌టిక‌ప్పుడు వాటిల్లో గ్లామ‌ర్‌గా క‌నిపిస్తూ ఉంటుంది. ఇక ఈవెంట్ల‌కు వెళ్లిన‌ప్పుడు అయితే హాట్ హాట్ డ్రెస్సుల‌తో క‌నువిందు చేస్తుంది. అలా ఆమె ఒక ఈవెంట్‌కు వెళ్లినప్పుడు తీసిన ఫొటోను, ఆమె చిన్న‌నాటి ఫొటోను రెండింటినీ క‌లిపి ఓ మీడియా సంస్థ హైలైట్ చేసింది. అంత‌టితో ఆగ‌లేదు. వారు ఆమె క‌ల‌ర్‌ను షేమ్ చేస్తూ అభ్యంత‌ర‌క‌ర‌మైన వ్యాఖ్య‌ల‌ను ఆ ఫొటోకు పెట్టి అనంత‌రం ఆ పోస్టును ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. చూడండి.. చిన్న‌ప్పుడు దిశా ప‌టానీ ఎంత అసహ్యంగా ఉందో.. ఇప్పుడెలా ఉందో.. అంటూ పోస్టులో రాశారు. దీంతో ఆ పోస్ట్ వైర‌ల్ అయింది. అయితే చివ‌ర‌కు దిశా పటానీ ఆ పోస్ట్ ప‌ట్ల స్పందించింది. ఆమె ఏమ‌న్న‌దంటే…

మీరు అంటుంది ముమ్మాటికీ నిజ‌మే. నేన‌ప్పుడు అంద‌మైన గౌన్ వేసుకుని హెయిర్ స్టైల్ చేయించుకుని మేక‌ప్ వేసుకుని వ‌స్తే అప్పుడు బాగుండేది క‌దా. అలా 7వ త‌ర‌గ‌తికి వెళ్ల‌వ‌చ్చు. అది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయి ఉండేది.. అని ఆ మీడియా సంస్థ‌కు దిశా ప‌టానీ త‌న ట్వీట్ ద్వారా కౌంట‌ర్ వేసింది. ఇక ఈ విష‌యంపై అంద‌రూ దిశా ప‌టానీకే మ‌ద్ద‌తు ప‌లికారు. స‌ద‌రు మీడియా సంస్థ‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. అయినా చిన్న‌ప్పుడు ఎవ‌రైనా అలాగే ఉంటారు క‌దా. ఆ విషయం కూడా తెలియ‌లేదు వారికి..!

Comments

comments

Share this post

scroll to top