అంతటా శ్రీమన్నారాయణ ..స్వామి కృప కోసం నిరీక్షణ

ఏపీలో ఏమో కానీ తెలంగాణ రాష్ట్రంలో వింత పరిస్థితి నెలకొంది . ఉద్యోగులు ..నిరుద్యోగులు తీవ్ర వత్తిళ్లకు లోనవుతున్నారు . భారీ ఎత్తున వేతనాలు ఉన్నా ఎక్కువగా అక్రమాలకు పాల్పడటం ..అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటం ..అందులో రెవెన్యూ శాఖకే చెందిన ఉద్యోగులు ఉండడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖాను ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు . ఈ విషయాన్ని లోక్ సభ ఎన్నికల సందర్బంగా తెలంగాణాలో జరిగిన సమావేశాల్లో స్పష్టం చేశారు . రెండు నెలలు ఓపిక పట్టండి ..నన్ను నమ్మండి ..అందరికి ఆమోదయోగ్యమైన కొత్తగా రెవెన్యూ చట్టాన్ని తీసుకు వస్తున్నామని వెల్లడించారు . ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూములకు సంబంధించిన అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు గాను ధరణిని రూపొందిస్తున్నామని చెప్పారు .

ఎన్నికల సభ సందర్బంగా ఓ రైతు తాను ఎలా రెవెన్యూ అధికారుల నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో సీఎం కు ఫిర్యాదు చేశారు . ఈ విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు . తాము లేకపోతే ప్రభుత్వం నడవదని..పరిపాలన అంతా తమ చేతుల్లో ఉంటుందని ..నిన్నటి దాకా అటు పాలకులకు ..ఇటు ప్రజలకు చుక్కలు చూపించిన రెవెన్యూ శాఖకు కోలుకోలేని షాక్ ఇచ్చారు కేసీఆర్ . సీఎం చేసిన ప్రకటన రెవెన్యూ వర్గాల్లో ..ఉద్యోగుల్లో సంచలనం కలిగించింది .రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి . తాము విధులను బహిష్కరిస్తామని ..అహోరాత్రులు కడుపులు మాడ్చుకుని విధులు నిర్వహించామని ..అయినా తమ పట్ల కేసీఆర్ ఇలా మాట్లాడటం తగదు అంటూ ఆందోళనలు ..నిరసన వ్యక్తం చేశారు . ఉద్యోగుల సంఘాలు ఇలా వ్యవహరించడం పై కేసీఆర్ నిప్పులు చెరిగారు . దేనినైనా భరిస్తాడు కానీ ఆయన తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఊరుకోరు .

ఇంకేం ..రెవెన్యూ శాఖను వ్యవసాయ శాఖలో కలిపేస్తానని స్పష్టం శేశారు . దీంతో అల్టిమేటం ఇచ్చిన సంఘాల నేతలు ఊహించని రీతిలో వెనక్కి తగ్గారు . ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గే ప్రసక్తే లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎటూ పాలుపోని స్థితిని ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు . ఒకసారి చెప్పక సీఎం తమ మాట వినడని ఒక నిరీనానికి వచ్చిన ఆయా సంఘాల నేతలు ..ఆయన్ను ప్రసన్నం ఎలా చేసుకోవాలనుకునే దిశగా సమాలోచనలు జరిపారు ఈ సమయంలో వారి మెదళ్లలో స్వామీజీలు మెదిలారు

. ఏ స్వామి దగ్గరకు వెళితే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందోనని ఆలోచనలో పడ్డారు . భాగ్యనగరానికి దగ్గరలో ఉన్న పేరొందిన ఓ స్వామీజీ దగ్గరకు వెళ్లి ..మోర పెట్టుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి . ప్రజలను పరిపాలన పేరుతో ముప్పుతిప్పలు పెడుతూ ..కాసులు ..ఆస్తులు వెనకేసుకుంటున్న ఉద్యోగులంతా ఇప్పుడు స్వాముల బాట పట్టారు . ఇప్పుడు తెలంగాణాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది . స్వాములు కరుణిస్తారా ..లేక గులాబీ మనసు కరుగుతుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

Comments

comments

Share this post

scroll to top