విజ్ఞాన భాండాగారం ..ఆద‌ర్శ ప్రాయం – శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి జీవితం

ఒక‌టా..రెండా..కొన్ని త‌రాల‌కు స‌రిప‌డా జ్ఞానం కావాలంటే ..జ‌గ‌ద్గురుగా సుప్ర‌సిద్ధులైన శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామిని ఒక్క‌సారి ద‌ర్శించుకుంటే చాలు. జ‌న్మ ధ‌న్య‌మ‌వుతుంది. మ‌నం ఏం కోల్పోయామో తెలుస్తుంది. ఇంకే గురువు అక్క‌ర్లేదు. ఇంకెవ్వ‌రి సూచ‌న‌లు..హితోక్తులు అందుకోవాల్సిన ప‌నిలేదు. అంతా మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. మ‌న‌మేమిటో..మ‌న జీవితం ఏమిటో అంత‌లా స్వామి వారు మ‌న‌ల్ని ఆవ‌హిస్తారు. ఆలోచ‌న‌లు రేకెత్తేలా చేస్తారు. స‌మ‌స్త జీవ‌రాశుల‌తో నిండి ఉన్న‌దే ఈ ప్ర‌పంచం. కానీ మాన‌వ జీవితం అట్లా కాదు..అదో అద్భుతం..అదో మ‌హ‌త్త‌ర‌మైన ..దేవుడు ఇచ్చిన మ‌హోన్న‌త‌మైన కానుక‌..ఈ అదృష్టం అంద‌రికీ రాదు..ఇదంతా పూర్వ జ‌న్మ సుకృత‌మే.

మ‌నం చేసిన మంచి ప‌నులే మ‌నల్ని మాన‌వులుగా ఇక్క‌డికి పంప‌బ‌డ్డాం. అంత‌కంటే కావాల్సింది ఈ జ‌న్మ‌కు ఇంకేం వుంటుంది..? భ‌క్తిని క‌లిగి వుండ‌టం వేరు..భ‌క్తితో ధ‌ర్మ‌బ‌ద్ధంగా ఉండ‌టం వేరు. ఒక్కోసారి రెండూ ఒకేలా అగుపిస్తాయి. కానీ త‌రిచి చూస్తే అవి వేర్వేరు అని అర్థ‌మ‌వుతుంది. ఈ స‌మాజం ఇంకా మారాల్సి ఉన్న‌ది. ఎన్నో కాలువలు ప్ర‌వ‌హిస్తూనే వుంటాయి. ఎన్నో ప‌శుప‌క్షాదులు జీవిస్తూనే ఉంటాయి. వాటి ధ‌ర్మాన్ని అవి నిర్వ‌ర్తిస్తున్నాయి. కానీ అన్నీ తెలిసిన‌..ఎన్నో అవ‌కాశాలు క‌లిగిన మ‌నం మాత్రం కాలాన్ని గుర్తించ‌డం లేదు. లైఫ్‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ సాగుతున్నాం. మ‌నుషులు గ‌తి త‌ప్ప‌కుండా ఉండేందుకు ఆత్మ గురువు లాగా వెన్నంటి వుంటూనే హెచ్చ‌రిస్తూ వుంటుంది. ఇది త‌ప్పు..ఇది ఒప్పు అని .జీవితంలో త‌ప్ప‌ట‌డుగులు వేయ‌కుండా ఉండాలంటే భ‌క్తిని అల‌వ‌ర్చు కోవాలి. ఇది మ‌నం ఎలా ప్ర‌వ‌ర్తించాలో..ఏలా జీవించాలో..ఎలా మ‌స‌లు కోవాలో నేర్పుతుంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే చేతి క‌ర్ర లాంటిది..గురువు చేతిలో బెత్తం లాంటిది అంటారు శ్రీ స్వామి వారు. కొన్ని గంట‌ల పాటు ఏ అంశ‌మైనా గుక్క తిప్పుకోకుండా..అన‌ర్ఘ‌లంగా..అప్ర‌హ‌తిహ‌తంగా బోధ‌న‌లు చేస్తారు. ప్ర‌వ‌చ‌నాలు చెబుతారు. వేదాల‌లోని సారాన్ని మ‌న‌కు అర్థ‌మ‌య్యేలా ల‌లిత ప‌దాల్లో వివ‌రిస్తారు. మాన‌వ జీవితం గొప్ప‌ది..దానిని గుర్తించి మ‌స‌లు కోవ‌డ‌మే మ‌నమంతా చేయాల్సిన ప‌ని..ఇది క‌ర్త‌వ్యంగా..లక్ష్యంగా భావించాలి. ఏ విజ‌యం ఒక్క‌సారితో స‌మ‌కూర‌దు. కొన్నేళ్ల పాటు శ్ర‌మ దాగి ఉంటుంది. ఏదీ ఊరికే ల‌భించ‌దు…క‌ష్ట‌ప‌డితేనే అందుతుంది. భ‌క్తి కూడా అంతే. నిరంత‌రం సాధ‌న చేయాలి. ప్ర‌తిక్ష‌ణం ధ‌ర్మ‌బ‌ద్ధంగా ఉండాలి. నా ద‌గ్గ‌ర ఎలాంటి మంత్ర‌దండాలు లేవు..ఉన్న‌ద‌ల్లా మ‌నుషుల‌ను..ప‌శుప‌క్షాదుల‌ను ప్రేమించ‌డమే.

కాలుష్యం క‌మ్ముకు వ‌స్తోంది. అధ‌ర్మం మ‌న‌ల్ని ఒక ప‌ట్టాన నిలువ నీయ‌డం లేదు. రాకెట్ కంటే స్పీడ్‌గా జ‌ర్నీ సాగుతోంది. టెక్నాల‌జీ పెరిగింది. నిన్న‌టి దాకా ఆకాశం అదో అంతులేని ర‌హ‌స్యం అనుకునే వాళ్లం..ఇపుడు ఇక్క‌డి నుండే క్ష‌ణాల్లో దానిని ద‌ర్శించుకుంటున్నాం. విజ్ఞానం పెరిగింది..కానీ విజ్ఞ‌త న‌శిస్తోంది. ఈ స‌మాజం బాగు ప‌డాలంటే కావాల్సింద‌ల్లా త‌ల్లిదండ్రులు కంక‌ణ‌బ‌ద్దులు కావాలి. వారే సంస్కారం నేర్ప‌గ‌లిగే గురువులు. వారి నుండే ఈ ప్ర‌పంచం నేర్చుకుంటుంది. విలువలే మ‌నుషుల్ని తీర్చిదిద్దుతుంది. ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా చేస్తుంది. ఇదంతా స్వానుభ‌వంలోంచి వ‌స్తుంది. ప్ర‌తిదీ ప‌రిశీలించి..త‌రిచి చూడ‌టం అల‌వాటుగా మార్చుకోవాలి..లేక‌పోతే ప్ర‌తిదీ బ‌రువనిపిస్తుంది. బ‌తుకంతా మోయ‌లేని భారంగా త‌యారై ..నిరాశ‌ను ఆశ్ర‌యించ‌డం అల‌వాటు చేసుకుంటాం.

ప్ర‌కృతి ఎంతో ఇచ్చింది. దానిని ఆస్వాదించండి. వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా మంచిని నేర్పే..విద్యాబుద్ధులు క‌ల్పించే పుస్త‌కాలు బోలెడున్నాయి. వాటిని చ‌దివే ప్ర‌య‌త్నం చేయండి. వంద మంది గురువులు బోధించ‌లేని..నేర్ప‌లేని విష‌యాల‌న్నీ ఒక్క పుస్త‌కం మ‌న‌కు నేర్పుతుంది. ప్ర‌పంచం ఐటీ మీద ఆధార‌ప‌డింద‌న్న‌ది వాస్త‌వ‌మే..కానీ అది మానవ‌త్వాన్ని పెంచే దిశ‌గా ప్ర‌య‌త్నం చేయ‌లేదు. చేయాల్సిందల్లా మ‌న‌మే. ఎంత విజ్ఞానం సంపాదించినా..మ‌నిషి ప్ర‌య‌త్నం లేనిదే ముందుకు వెళ్ల‌లేం. ధ్యానం చేయండి..యోగాను సాధ‌న చేయండి. ఆధ్యాత్మికత‌ను ఆపాదించుకోండి..మీ జీవితం ఇంత‌కంటే ముందుకంటే మెరుగ్గా అనిపిస్తుంది. మ‌న‌సు తేలికవుతుంది..హృద‌యం ప్ర‌శాంతంగా వుంటుంది. రోజంతా లెక్క‌లేనంత ఖ‌ర్చు చేస్తాం. ప‌ది రూపాయ‌లు పెడితే పుస్త‌కం దొరుకుతోంది. ఇపుడంతా స్మార్ట్ ఫోన్ల మ‌యమై పోయింది. చెత్త‌ను తీసి వేయండి..మంచిని కోరుకోండి..బ‌లంగా..అక్క‌డే ఆగిపోతారు. లెక్క‌లేనంత‌..మోయ‌లేనంత విజ్ఞానానికి కావాల్సినంత స‌మాచారం ఇంట‌ర్నెట్‌లో దొరుకుతోంది. నేర్చుకునే అభిలాష మీకుంటే మీరు ధ‌న్య‌జీవులే..చ‌దువు దీపంలా దారి చూపిస్తే ..ఆధ్యాత్మిక భావ‌న‌..భ‌క్తి మ‌న‌కు ఆత్మ సాక్షాత్కారించేలా చేస్తుంది. కావాల్సింద‌ల్లా భ‌క్తి ని ప్రేమించ‌డ‌మే..ప్రేమ‌తో అన్నీ సాధ్య‌మ‌వుతాయి. శాంతి..సౌఖ్య‌ము అల‌వ‌డుతాయంటారు చిన్న‌జీయ‌ర్ స్వామి.

వీలు దొరికితే..దివ్య సాకేతాన్ని ద‌ర్శించండి. పిల్ల‌లు, పెద్ద‌లు క‌నిపిస్తారు. అంతా భ‌క్తిమ‌యం. అంధులైనా ..అల‌వోక‌గా అక్ష‌రాలు వ‌ల్లె వేస్తారు. వేదాల సారాన్ని గ్ర‌హిస్తారు. ల్యాప్ టాప్‌లతో భ‌విష్య‌త్‌ను నిర్దేశించే పాఠాలు నేర్చుకుంటారు. ఎన్నో ఆశ్ర‌మాలు..మ‌రెన్నో సేవా కార్య‌క్ర‌మాలు..ఇసుకేస్తే రాల‌నంత భ‌క్త జ‌నం..ఒకే స్మ‌ర‌ణ‌తో ద‌ద్ద‌రిల్లుతూ వుంటుంది..అదే జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌. కావాల్సింద‌ల్లా సంక‌ల్ప‌మే..భ‌క్తిని క‌లిగి ఉండ‌ట‌మే. వేద గురువుగా..ఉప‌దేశ‌కుడిగా..భ‌క్తుల‌కు ఆరాధ్య దైవంగ‌..జ‌గ‌త్ గురువుగా వినుతికెక్కిన ..ఆ మహానుభావుడి ఆశీస్సులు అందుకోండి..ఎన‌లేని శ‌క్తి మ‌న‌లోకి వ‌స్తుంది..ఆ విజ్ఞాన కాంతులు పొర‌లు క‌మ్మిన క‌ళ్ల‌కు వెలుగులు ప్ర‌స‌రించేలా చేస్తాయి.

Comments

comments

Share this post

scroll to top