12 యేళ్లు కూడా నిండని అమ్మాయిలే అమ్మలు..ఫోటోలతో సహా వివరించిన జర్నలిస్ట్.

బంధువుల కామ వాంఛకు గురై ,తమదైన బాల్యానికి దూరమై, దుర్భర జీవితాన్ని గడుపుతున్న అనేక అత్యాచార బాధిత పిల్లలు తల్లులుగా మారిన వైనాన్ని ఫోటోలతో సహా ప్రచురించి, మన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టింది ఓ ఫోటో జర్నలిస్ట్ లిండా పర్సేల్ ..కొన్నేళ్లుగా శ్రమించి…దక్షిణ మెక్సికోలోని గ్వాటెమాలలో అత్యాచారానికి గురై, బాల్యం లోనే తల్లులుగా మారిన అనేక మంది చిన్నారుల ఉదంతాలను, ఫోటోలతో సహా సేకరించి ఓ కథనాన్ని వెలువరించింది. ఇప్పుడీ కథనం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

11 యేళ్లకే పెళ్లి…13 యేళ్లకు గర్భం….ప్రసవంలోనే మృత్యువు:
అలీసియా అనే అమ్మాయికి 11యేళ్లకే పెళ్లి చేశారు. 13 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చింది, ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అతికష్టం మీద ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అయిన గంటలోపే తల్లి, కొడుకులిద్దరూ చనిపోయారు.

1

13 యేళ్ల వయస్సులో…సంకలో బిడ్డతో..ఆడుకుంటూ:
మటక్వెస్కింట్ల ప్రాంతానికి చెందిన లిలియన్‌ ప్రస్తుత వయస్సు 13. ప్రతిరోజూ 26 యేళ్ల తన మేనమామ చేతిలో అత్యాచారానికి గురవుతోంది. 11 ఏళ్ల ప్రాయంలో ఇంటివెనుక ఆడుకుంటున్న సమయంలో ఆమెపై రేప్‌ జరిగింది. కొన్ని నెలల తర్వాత ఆమె గర్భవతని తేలింది. ఇప్పుడో బిడ్డకు తల్లయ్యింది. తన బిడ్డను ఎత్తుకొని తమ్ముడితో కలిసి ప్రతిరోజూ ఆడుకుంటుంది.

2

తోటి పిల్లలతో ఆడుకుంటూ…

14 ఏళ్ల బాలుడికి, 12 యేళ్ల హైదీకి పెళ్లి జరిగింది…ఏడాదిలోనే వాళ్లిద్దరికి ఓ బిడ్డ. హైదీ చంకలో పిల్లనెత్తుకుని తోటి పిల్లలతో ఆడుకుంటోంది.

1441521318heidi-holds

11 యేళ్ల పాపకు, 53 యేళ్ల ముదుసలికి పెళ్లి…పాప పుట్టగానే పాడెక్కిన భర్త:

1441523823glori

రక్షణ లేకపోవడం, కఠిన చట్టాల లేమి, సరైన విద్య, ఆరోగ్య భద్రతా అంశాల మీద కనీస అవగాహన లేకపోవడం వల్ల..ఇక్కడ ఈ సమస్య అధికంగా ఉంది. కోరిక కలగగానే అందుబాటులో ఉన్న మైనర్ అమ్మాయిల మీద ఎగబడడం కోరిక తీర్చుకోవడం ఇక్కడి వారికి అలవాటైంది. దాని ఫలితంగా  సదరు బాలిక గర్భావతి అవ్వడంతో  తప్పనిసరి పరిస్థితుల్లో వారికి వివాహం చేసేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. కుదిరితే వేరే సంబంధం, లేదంటే వయసుతో నిమిత్తం లేకుండా సదరు బాలికను రేప్ చేసిన వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేస్తున్నారు.

మైనర్లపై అత్యాచారాలు-చిన్నతనంలోనే తల్లులుగా మారిన పిల్లలపై విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించిన లిండా పర్సేల్ కు ధన్యవాదాలు;

1441521323linda-forsell

Comments

comments

Share this post

scroll to top