నా చిన్న‌నాటి చిలిపి జ్ఞాప‌కం ఆ “ల‌వ్ లెట‌ర్” .! ఇప్ప‌టికీ 20 ఏళ్ళు అవుతుంది!

నా పేరు అరుణ్‌…ప్ర‌స్తుతం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజ‌ర్ గా జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్ప‌బోయేది 20 సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న‌…. అప్పుడు నేను 5 Th Class, స్కూల్లో రాజీ ప‌క్క‌నే కూర్చునేవాడిని..ఆమే నా బెస్ట్ ఫ్రెండ్ కూడా.! అయితే ఓ రోజు హోమ్ వ‌ర్క్ అయ్యాక‌…ఓ పేప‌ర్ మీద‌ రాజీ I LOVE YOU అని రాసి, మార్నింగ్ స్కూల్ కు వెళ్ల‌గానే త‌నికిద్దామ‌ని నా పెన్సిల్ బాక్స్ లో పెట్టుకున్నాను.! అప్పుడే మా అక్క త‌న పెన్సిల్ క‌న‌బ‌డ‌క‌పోవ‌డంతో…. నేను తీశానేమోన‌ని నా పెన్సిల్ బాక్స్ ను కూడా వెతికింది.! నా బాక్స్ లో ఉన్న పేప‌ర్ ను చూసి, మా డాడీకి ఇచ్చింది. వేలెడంత లేదు….ల‌వ్ లు కావాల్సొచ్చిందా నీకూ..? అంటూ మా నాన్న బెల్ట్ తీసుకొని నాలుగు వాత‌లు ప‌డేలా కొట్టారు.! మార్నింగ్ స్కూల్ కూడా వెళ్ల‌లేదు.! అప్ప‌టి నుండి రాజీ ని చూస్తేనే మా నాన్న గుర్తొచ్చి భ‌యం వేసేది.!

ఈ సంఘ‌ట‌న జ‌రిగి దాదాపు 20 ఇయ‌ర్స్…నేను సీరియ‌స్ గా ఉన్న స‌మ‌యంలో మా అక్క‌య్య ఆ రోజు జ‌రిగిన సంఘ‌ట‌న‌ను గుర్తుచేస్తుంది. వెంట‌నే మూడ్ మొత్తం మారిపోయి క‌డుపుబ్బా న‌వ్వుకుంటాం.!రాజీ I LOVE YOU , రాజీ I LOVE YOU అంటూ చాలా సార్లు ఆట‌ప‌ట్టిస్తూనే ఉంటుంది.! ఆ రోజులు త‌ల్చుకుంటే ఏదో ఆనందానుభూతి క‌ల్గుతుంది.!!

Comments

comments

Share this post

scroll to top