చినిగిన కరెన్సీ నోట్లను బ్యాంకు లో మార్చుకోడానికి ఇబ్బందులు పడుతున్నారా.?

ఇటీవల కాలం లో చిరిగిన కొత్త కరెన్సీ నోట్లను బ్యాంకు లో మార్చుకోడానికి నానా తిప్పలు పడుతున్నారు జనాలు. చిరిగిన నోట్లని బ్యాంకు లలో మాత్రమే ఎటువంటి కట్టింగ్స్ లేకుండా తిరిగి మార్చుకొనే సౌలభ్యం ఉంటుంది, కానీ ఇటీవల కాలం లో అలా చిరిగిన నోట్లను మార్చుకోడం కష్టం అయిపోయింది, దానికి కారణం RBI ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలే.

ఇంత మేర అనే ఉండాలి, లేకుంటే అంతే.. :

200 రూపాయల నోటు చిరిగిన ప్రదేశం 39 స్క్వేర్ సెంటీమీటర్లకు మించకుండా ఉంటే మార్పిడి సమయంలో పూర్తి స్థాయిలో రిఫండ్ పొందొచ్చు, ఒక వేళ 78 స్క్వేర్ సెంటీమీటర్ల మేర నోటు చిరిగితే మీ చిరిగిన నోటుకి మీకు రూపాయి కూడా రాదు, 2 వేల రూపాయల నోటు విషయానికి వచ్చే సరికి చిరిగిన ప్రదేశం 44 స్క్వేర్ సెంటీమీటర్లకు మించకూడదు. 88స్క్వేర్ సెంటీమీటర్లు నోటు చిరగకూడదు. 2వేల నోటు పూర్తి వైశాల్యం 109.56 స్క్వేర్ సెంటీమీటర్లు.

ఇన్నిసెంటీమీటర్ ల మేరనే ఉండాలి అనే విషయం అయి మనోళ్లు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటె అది ఎంత సెంటీమీటర్ల మేర చినిగిందనేది ప్రతి ఒక్కరు కొలచలేరు, కనుక బ్యాంకు లో ఒక వేళ కొలిచినా, వారు మన నోటును మార్చుకొనే సమయానికి మనల్ని తిప్పలు పెడుతున్నారని చాలా మంది చెబుతున్నారు. కనుక మీ చినిగిన నోట్లను మార్పించే ముందు, ఒక సారి వీలైతే కొలుచుకోండి ఎన్ని సెంటీమీటర్స్ మేర చినిగిందో.

 

Comments

comments

Share this post

scroll to top