రాత్రికి రాత్రే….ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.

అందం… ఇత‌రుల‌ను ఆక‌ట్టుకునే ఆకర్ష‌ణీయ‌త‌… మంచి శ‌రీర సౌష్ట‌వం… ఇవి ఉంటే చాలు. నేటి త‌రుణంలో ఎవ‌రైనా రాత్రికి రాత్రే పాపుల‌ర్ అయిపోవ‌చ్చు. అది ఎలా అంటారా..? అదేనండీ సోష‌ల్ మీడియా ఉందిగా. దాని ద్వారానే ఎవ‌రైనా పాపుల‌ర్ అవ‌చ్చు. అయితే ముందే చెప్పాం క‌దా. అలా పాపుల‌ర్ అవాలంటే అందుకు కొన్ని కొల‌మానాలు ఉంటాయ‌ని. అవును, వాటిని స‌రిగ్గా మెయింటెయిన్ చేస్తే చాలు, ఏ ఫొటోగ్రాఫ‌ర్‌తోనో మంచి ప్రొఫైల్ పిక్స్ తీయించుకుని వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తే, ఇక అంతే. నెటిజ‌న్ల‌కు న‌చ్చితే ఇక ఆ ఫొటోలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అలా ట్రెండ్ అవుతున్న ఫొటోల్లో చైనాకు చెందిన ఈ యువ‌తి ఫొటోలు కూడా ఉన్నాయి.

chinese-girl-photos

ఇంటర్నెట్‌, సోష‌ల్ మీడియా ప్ర‌పంచంలో ది చైనీస్ స్పైస్ సెల్ల‌ర్ పేరిట ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఓ అంద‌మైన చైనా యువ‌తికి చెందిన రెండు ఫొటోలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. స‌ద‌రు యువ‌తి మిర‌ప‌కాయ‌ల‌ను అమ్ముతున్న‌ట్టుగా తీసిన ఫొటోల‌వి. అయితే ఆమె నిజంగా వాటిని అమ్ముకుంటుందా..? లేక కేవ‌లం ఫొటోషూట్ కోసం అలా చేసిందా..? అనేది మాత్రం తెలియ‌దు. కానీ ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ వంటి సైట్ల‌లో ఇప్పుడామె ఫొటోలు హాట్ టాపిక్‌గా మారాయి.

సోష‌ల్ మీడియా అంటేనే ఓ వైర‌ల్ క‌దా. అందులో నెటిజ‌న్ల‌కు ఏదైనా న‌చ్చితే చాలు. ఇక టాపిక్ వైర‌ల్ అవుతుంది. ఇప్పుడా చైనా యువ‌తి ఫొటోలు కూడా అలాగే వైర‌ల్‌గా మారాయి. గ‌తంలో పాకిస్థాన్‌కు చెందిన అర్ష‌ద్ ఖాన్ అనే చాయ్‌వాలా ఇలాంటి ఫొటోల‌తోనే ఫేస్‌బుక్ ద్వారా రాత్రికి రాత్రే పాపుల‌ర్ మోడ‌ల్ అయిపోయి, ప్ర‌ముఖ సంస్థ కాంట్రాక్టులు ద‌క్కించుకున్నాడు. అనంత‌రం నేపాల్‌కు చెందిన ఓ యువ‌తి ఫొటోలు కూడా ఇలాగే సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే ఆమె ఎవ‌రు, ఏమిటి అనే విష‌యం ఇంకా తేల‌లేదు. అది అలా తేల‌క‌ముందే ఇప్పుడీ చైనా యువ‌తి ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఈమె ఎవ‌ర‌నేది తెలుస్తుందా..? లేదా…? అన్న‌ది వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top