రాత్రి మీకు మేలిక‌య్యే టైమ్ ను బ‌ట్టి, మీ అస‌లు ప్రాబ్ల‌మ్ ఏంటో చెప్పొచ్చు.Check It.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ఎంత అవసరమో, నిర్దిష్ట సమయం పాటు నిద్ర పోవడం కూడా అంతే అవసరం. నిద్రించడం వల్ల శరీరం శక్తిని పొందడంతోపాటు మరుసటి రోజంతా ఉత్తేజంగా ఉండవచ్చు. అయితే నేటి బిజీ జీవితంలో మనం నిత్యం అనేక ఒత్తిళ్లను, ఆందోళనలను నిద్రపై కూడా ప్రభావం చూపుతున్నాయి, చాలా మంది నిద్రలో అకస్మాత్తుగా ఉలిక్కి పడుతున్నారు. అయితే ఇలా జరగడం మాత్రం అనారోగ్యకర పరిణామమేనని చెబుతోంది చైనీస్ ఆర్గాన్ బాడీ క్లాక్. రాత్రి పూట నిద్ర పట్టకపోవడం, అర్థరాత్రి అకస్మాత్తుగా మెళకువ రావడం తదితర పరిస్థితులను ఎదుర్కొనే వారికి అసలు నిజంగా ఏం జరుగుతుందో, వారు ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ క్లాక్ కచ్చితంగా చెబుతుందట. అదెలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య మీకు నిద్ర పట్టడం లేదా? నిద్రించాలంటే ఇబ్బందిగా ఉందా? అయితే మీ శరీర రోగ నిరోధక వ్యవస్థ, అడ్రినల్, థైరాయిడ్ గ్రంథులు అనారోగ్యంగా ఉన్నాయని అర్థం. ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలు కూడా మీలో అధికంగా ఉంటాయి. అయితే ఈ సమయంలో చైనీస్ ఆర్గాన్ బాడీ క్లాక్ ప్రకారం మన రక్తనాళాలు, కవాటాలు ఉత్తేజంగా ఉంటాయట.
v04juixdmgmiwte4e6x8
రాత్రి 11 నుంచి అర్థరాత్రి 1 గంట మధ్యలో మెళకువ వస్తుందా? అయితే మీరు మరిన్ని ఆరోగ్యకరమైన కొవ్వులను తినాలట. దీంతోపాటు ఇతరుల గురించి లేదా మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తే ఈ సమయంలో మెళకువ వస్తుందట. అయితే ఈ సమయంలో మన గాల్‌బ్లాడర్ యాక్టివ్‌గా ఉంటుందట. ఇది ఆ రోజులో మనం తిన్న కొవ్వులను కరిగించే పనిలో ఉంటుంది.
4m5m2189myqftfr566i6
అర్థరాత్రి 1 నుంచి  3 గంటల మధ్య లేస్తున్నారా? అయితే మీ లివర్‌పై అధికంగా ఒత్తిడి పడుతుందని అర్థం. ఆల్కహాల్ సేవించడాన్ని తగ్గించాలి. అయితే తీవ్రమైన కోపం, తప్పు చేశామన్న భావన ఉన్నవారికి ఇలా మెళకువ వస్తుందట. ఆ సమయంలో మన లివర్ యాక్టివ్‌గా ఉంటుందట.
6dvm7txhe2olarsuadog
తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య నిద్ర లేస్తే? ఈ సమయంలో మన ఊపిరితిత్తులు శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను అందిస్తుంటాయి. డిప్రెషన్‌లో ఉన్నవారు, విచారంలో ఉన్న వారు ఈ సమయంలో లేస్తారు. అయితే వీరు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం, ప్రకృతిలో ఎక్కువగా గడపడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే తమ సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య మెళకువ వస్తుంటే? ఈ సమయంలో మన పెద్ద పేగు యాక్టివ్‌గా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపేందుకు అది సిద్ధంగా ఉంటుంది. ఈ సమయంలో కొద్దిగా నీటిని తాగితే చాలు. విరేచనం సులభంగా అవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారు జీవితంలో తమ ఎదుగుదలను గురించి విచారిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి.
n5gjyhh6yhx2zqo4g3tc

Comments

comments

Share this post

scroll to top