చైనా వారు త‌యారు చేసిన ఈ రైలుకు ప‌ట్టాలు అక్క‌ర్లేదు. రోడ్ల మీదే న‌డుస్తుంది తెలుసా..?

ప్యాసింజ‌ర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సూప‌ర్ ఫాస్ట్ ట్రెయిన్స్‌… ఇలా మ‌న దేశంలో స్పీడ్‌ను బ‌ట్టి న‌డిచే రైళ్లు ర‌క‌ర‌కాలుగా ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని రైళ్ల‌ను స‌రుకుల‌ను ర‌వాణా చేసేందుకు వాడుతారు. జ‌పాన్ వంటి దేశాల్లోనైతే గంట‌కు 400 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించే బుల్లెట్ రైళ్లు కూడా వ‌చ్చేశాయి. అయితే ఏ ట్రెయిన్ అయినా ప‌ట్టాల‌పై ప్ర‌యాణించాల్సిందే. కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయే ట్రెయిన్ మాత్రం అలా కాదు. ప‌ట్టాలు లేకున్నా సాధార‌ణ రోడ్ల‌పై కూడా న‌డుస్తుంది తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ అసలు ఈ ట్రెయిన్‌ను త‌యారు చేసింది ఏ దేశం వారో తెలుసా..?

చైనా… అవును, వారే ఈ ట్రాక్‌లెస్ ట్రెయిన్‌ను కొత్త‌గా త‌యారు చేశారు. ఇది న‌డ‌వ‌డం కోసం రైలు ప‌ట్టాలు అవ‌స‌రం లేదు. రోడ్డు స‌రిగ్గా ఉంటే చాలు. గంట‌కు 70 కిలోమీట‌ర్ల వేగంతో ఈ రైలు వెళ్ల‌గ‌ల‌దు. మ‌రి ప‌ట్టాలు లేకుండా ఈ ట్రెయిన్ అస‌లు ఎలా న‌డుస్తుంది..? అనేగా మీ డౌట్‌..! అదెలాగంటే… ప‌ట్టాలు లేక‌పోయినా, ట్రెయిన్ కింది భాగంలో ప్లాస్టిక్ భాగంపై అమ‌ర్చిన ప్ర‌త్యేక‌మైన ర‌బ్బ‌రు వీల్స్ ఉంటాయి. అయితే అవి మ‌న కంటికి క‌నిపించ‌వు. అయిన‌ప్ప‌టికీ వాటి ద్వారానే ఈ ట్రాక్‌లెస్ ట్రెయిన్ న‌డుస్తుంది.

ఇక ఈ ట్రాక్‌లెస్ ట్రెయిన్ పూర్తిగా ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన ట్రెయిన్ అట తెలుసా..! అంటే దీని వ‌ల్ల పర్యావ‌ర‌ణానికి ఎలాంటి ముప్పు ఉండ‌దు. పూర్తిగా కాలుష్య ర‌హితంగా ఉండేలా దీన్ని త‌యారు చేశారు. ఇలాంటి ఒక్క ట్రెయిన్‌కు దాదాపుగా రూ.378 కోట్ల నుంచి రూ.662 కోట్ల వ‌ర‌కు అవుతుంద‌ట‌. అంటే ఒక స‌బ్‌వే (భూగ‌ర్భ రైలు) ఖ‌రీదులో ఇది కేవ‌లం 5వ వంతు మాత్ర‌మేన‌ట‌. అయితే ఈ రైలు 2018లో రోడ్ల‌పైకి రానుంది. అందుకు అనుగుణంగా రోడ్ల‌ను రీమోడ‌లింగ్ చేస్తున్నారు. మ‌రి ఇలాంటి ట్రెయిన్లు మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు వ‌స్తాయో వేచి చూడాలిక‌..!

Comments

comments

Share this post

scroll to top