ట్రూ లవ్…అంటే ఇదే.! ప్రేయసి అస్థికలను పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.

చైనాలోని తైవాన్ లో తాయ్ అనే యువకుడు అదే  ఊరిలో  తన మనసుకు నచ్చిన ఓ యువతిని మొదటిచూపులోనే  ప్రేమించాడు. తన మనసులోని మాటను ఆమెకు చెప్పాడు. అతడూ ఆమెకు నచ్చడంతో ఆమె తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవితాంతం కష్ట సుఖాలలో  ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. వీరిద్దరిని చూసి జంట చూడముచ్చటగా ఉందంటూ అక్కడి ప్రజలు అనుకునేవారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆ యువతి ఈ లోకాన్ని విడిచి,తాయ్ ని ఒంటరిని చేసింది.

993088_337315843063610_286821049_n

 తన  ప్రేయసిని మరచిపోలేని తాయ్, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సించు అనే గ్రామంలో తన పెళ్లి అని, తను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుంటున్నానని,అంతా తప్పకుండా ఆ పెళ్లికి హాజరుకావాలని ఆహ్వానించాడు. చనిపోయిన యువతిని ఎలా పెళ్లి చేసుకుంటాడని ఆ ఊరి జనం ఆ పెళ్లికి హాజరయ్యారు. తాయ్, తన ప్రేయసి అస్తికలను ఒక చిన్న బాక్స్ లో  భద్రంగా ఉంచి, ఆ బాక్స్ కు గౌను వేసి పెళ్లికూతురిగా అలంకరించుకొని వివాహం చేసుకున్నాడు. తాయ్ కు ఆమెపై ఉన్న ప్రేమను చూసి అక్కడి జనం ఉద్వాగానికి లోనయ్యారు. తాయ్ ప్రేమ, అతడు గొప్ప ప్రేమికుడు అని సోషల్ మీడియాలో ఈ వార్త షికారు చేస్తోంది.

Comments

comments

Share this post

scroll to top