చిన్న పిల్ల‌ల‌ను రాచి రంపాన పెడుతున్న చైనా ప్ర‌భుత్వం… ఒలంపిక్ మెడ‌ల్స్ పైనే వారి యావంతా…

ఏదైనా ఒక ఆట‌లో గెలుపొందాలంటే ఏ క్రీడాకారుడైనా ఏం చేస్తాడు? కృషి, ప‌ట్టుద‌ల‌తో తీవ్రంగా శ్ర‌మించి ఆ ఆట‌లో గెల‌వ‌డం కోసం పోరాటం చేస్తాడు. అలా చేయ‌డం కోసం ఆ ఆట‌కు చెందిన శిక్ష‌ణ‌ను ముందుగానే తీసుకుంటాడు. మ‌రి అదే ఆట‌ను ఒలంపిక్స్ లాంటి అంతర్జాతీయ టోర్న‌మెంట్స్‌లో ఆడాల్సి వ‌స్తే? దానికి సంబంధించిన శిక్ష‌ణ ఇంకా క‌ఠినంగా, క‌ఠోరంగా ఉంటుంది. అయినా స‌రే మెడ‌ల్ సాధించాల‌నే త‌ప‌న ఉన్న వారు అలాంటి శిక్ష‌ణ‌నే తీసుకుంటారు. అయితే అది పెద్ద‌ల‌కైతే ఫ‌ర్వాలేదు. మరి చిన్నారుల‌కైతే? విన‌డానికే బాధగా అనిపిస్తుంది క‌దూ! కానీ ఇది నిజ‌మే. మ‌న పొరుగు దేశ‌మైన చైనాలో ఇప్పుడిదే జ‌రుగుతోంది.

నాలుగేళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే ఒలంపిక్స్‌లో ఎలాగైనా స‌రే ఎక్కువ మొత్తంలో మెడ‌ల్స్ సాధించాల‌నే ఉద్దేశంతో చైనా ప్ర‌భుత్వం ఇప్పుడ‌క్క‌డి చిన్నారుల‌కు ప‌లు ఒలంపిక్స్ క్రీడ‌ల్లో క‌ఠోర‌మైన శిక్ష‌ణ‌ను ఇస్తోంది. ఇందుకోసం అక్క‌డ అనేక ర‌కాల స్పోర్ట్స్‌ స్కూల్స్ కూడా వెలిశాయి. వాటిల్లోని శిక్ష‌కులు అక్క‌డి చిన్నారుల‌కు అత్యంత క‌ఠోర‌మైన శిక్ష‌ణ‌నిస్తున్నారు. వారి వ‌య‌స్సుకు, శ‌క్తికి, తాహ‌తుకు మించిన ప‌నులను చేపిస్తూ ఇప్ప‌టి నుంచే వారిని ఒలంపిక్ మెడ‌ల్స్ కోసం త‌యారు చేస్తున్నారు.

అయితే చెప్పుకోవ‌డానికి ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా అలాంటి క‌ఠోరమైన శిక్ష‌ణ‌కు ఆ పిల్ల‌లు తాళ‌లేక‌పోతున్నార‌ట‌. శిక్ష‌ణా స‌మ‌యంలో అనేక మంది చిన్నారులు అత్యంత బాధ‌తో ఏడుస్తున్నార‌ట‌. అయినా స్కూల్స్‌కు చెందిన కోచ్‌లు వారిపై క‌నిక‌రం చూపించ‌కుండా, వారు ఎంత ఏడుస్తున్నా ప‌ట్టించుకోకుండా అదే ప‌నిగా శిక్ష‌ణ‌నిస్తూనే ఉన్నార‌ట‌. ప్ర‌ధానంగా జిమ్నాస్టిక్స్‌, తైక్వాండో వంటి క్రీడ‌ల కోసం శిక్ష‌ణ పొందే చిన్నారుల బాధ వ‌ర్ణ‌నాతీత‌మ‌ని అక్కడి ప‌లువురు ఫొటోగ్రాఫ‌ర్లు తీసిన ఫొటోలే రుజువు చేస్తున్నాయి. కోచింగ్ తీసుకునే స‌మ‌యంలో ఆ చిన్నారులు బాధ‌తో విల‌పిస్తుండ‌డాన్ని మ‌నం కూడా గ‌మ‌నించ‌వ‌చ్చు.

జిమ్నాస్టిక్స్ నేర్చుకోలేక ఏడుస్తున్న ఓ చిన్నారి

china-children

కాళ్ల‌తో ఆ క‌ర్ర చివ‌ర‌ని తాకితేనే జిమ్నాస్టిక్స్‌లో ప్ర‌తిభ చూపిన‌ట్టు

china-children

ఎక్స‌ర్‌సైజ్‌కు త‌ట్టుకోలేక విలపిస్తున్న ఓ చిన్నారి

china-children

ముక్కుకు గాయ‌మైనా తైక్వాండోను ప్రాక్టీస్ చేస్తున్న ఓ బాలుడు

china-children

పైన ఇచ్చిన‌వి కేవ‌లం శాంపిల్ మాత్ర‌మే. ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు చైనాలోని ఏ స్పోర్ట్స్ స్కూల్‌కు వెళ్లినా క‌నిపిస్తాయి. నిజంగా వారిని చూస్తే జాలేస్తుంది క‌దా!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top