సొంతంగా 63 రోబోల‌ను త‌యారు చేసిన రైతు!

మ‌న‌ దేశంలో అయినా రైతంటే అన్న‌పెట్టే అన్న‌దాత‌. భూమిని మాత్ర‌మే న‌మ్ముకోవ‌డం.. ఆరుగాలం క‌ష్ట‌ప‌డ‌టం.. పంట‌లు పండించ‌డం.. దేశానికి తిండి పెట్ట‌డం త‌ప్ప మ‌రొక‌టి తెలియ‌దు. కానీ ఈ దేశంలో ఓ రైతు పంట‌లు పండిస్తూనే టెక్నాల‌జిని దున్నేస్తున్నాడు. చ‌దువుకున్నది త‌క్కువే అయినా శాస్త్ర‌వేత్త‌ల‌కు ఏం తీసిపోనంటున్నాడు. ఇంత‌కీ ఈయ‌న చేస్తున్న ప‌నేంటి.. అంత‌గా టెక్నాలిజితో ఆడుకుంటున్న ఈయ‌న టాలెంట్ ఏంటో తెలుసుకుందాం.

చైనా.. ఈ దేశం పేరు చెపితే చాలు ట‌క్కున గుర్తుకు వచ్చేది రోబోల త‌యారి. అక్క‌డి శాస్త్ర‌వేత్త‌లు నిత్యం ఏదో ఒక కొత్త‌ర‌కం రోబోను తయారి చేస్తునే ఉంటారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ..ఇక్క‌డి ఓ రైతు మాత్రం అంద‌రిని షాక్ కి గురి చేస్తూ రోజుకో కొత్త ర‌కం రోబోను త‌యారు చేస్తున్నాడు. త‌న‌ ఇంటి నుండి మొద‌లు పొలం ప‌నుల‌కు వివిధ ర‌కాలుగా సాయప‌డేలా ఉండే రోబోల‌ను ఏకంగా 63 తయారు చేసుకున్నాడు. ఇంజ‌నీరింగ్ చేశాడా అంటే అది లేదు. ఈ రైతు చ‌దివింది కేవ‌లం స్కూల్ చ‌దివే. ఈయ‌న పేరు వూ యులు. బీజింగ్‌కు చెందిన ఈయ‌న స్కూల్ చ‌దువును కూడా మ‌ధ్య‌లోనే ఆపేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించాడు.wu-yulu2b
అయితే చిన్న త‌నం నుండి రోబోటిక్స్‌పై తనకున్న ఆసక్తిని మాత్రం ప‌క్క‌న పెట్ట‌లేదు. టైం దొరికిన‌ప్పుడల్లా రోబోలు ఎలా త‌యారి చేయాల‌న్న విషయాన్నే ఆలోచించేవాడు. ఎలాగైనా మర మనుషులను రూపొందించాల‌న్న ఆశ‌యంలో అందుకు సంబందించిన‌ పుస్తకాలు చదివి, ఆన్ లైన్ లో త‌యారికి సంబందించిన‌ వీడియోలు చూసి రోబోలు త‌యారి చేయ‌డం మొద‌లుపెట్టాడు. 30 ఏళ్ల క్రితం రోబోను త‌యారు చేయ‌డం ప్రారంభించిన ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 63 రోబోల‌ను త‌న ఓన్ టెక్నాల‌జీతో త‌యారు చేశాడు. ఇందులో మ‌రో విశేషం ఉంది. తాను త‌యారు చేసిన ప్ర‌తి రోబో త‌ను లేకుండా ఉండ‌లేవు. ప్రతీ రోబోకు పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్ల‌తో పిలిస్తేనే అవి క‌దులుతాయి. వూ లావొ దా, వూ లావొ శాన్‌, వూ లావొ లియు షి శాన్ ఇలా వుయు ఇంటి పేరుతో వాటికి పేర్లు ఉన్నాయి. 3 ద‌శాబ్దాల క్రితం వూ లావొ దా నుండి ప్రారంభమైన రోబోల సంఖ్య‌.. వూ యూలు కుటుంబంలో పెరుగుతూనే ఉంది. ఎంతో ఇష్టంతో రూపొందించిన రోబోలను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాడు వూ యులు. అంతే కాదు ఈ రోబోలు ఆట‌లు, పాట‌లు, రోజు వారి ప‌నులు ఇట్టే చేయ‌గ‌ల‌వు.. వూ యులుని రిక్షాపై ఎక్కించుకొని బయటికి తీసుకెళ్ల‌డం కూడా చేస్తాయి. పొలం ప‌నులు కూడా ద‌గ్గ‌రుండి చేస్తాయి.అవి కూడా ఈ రైతుని క‌న్న తండ్రి కంటే ఎక్కువ‌గానే చూసుకుంటున్నాయి. ఇంత‌కంటే ఏం కావాలి చెప్పండి.

Comments

comments

Share this post

scroll to top